ఆస్త్మా రోగులకు ప్రతి ఏటా చేపమందుని పంపిణి చేసే బత్తిని హరినాథ్ గౌడ్ నిన్న రాత్రి 10 గంటలకు హైదరాబాద్ కవడిగుడాలోని తన నివాసంలో కన్ను మూసారు. 84 ఏళ్ళ బత్తిని అనారోగ్య కారణాలతో పరమపదించారని కుటుంభ సభ్యులు తెలిపారు. ఈయన పంపిణి చేసే చేపమందు కోసం కొన్నివేలమంది ఎదురు చూస్తారు.
ప్రతి ఏడు మృగశిర కార్తి రోజున బత్తిన కుటుంబ సభ్యులు ఆస్త్మా, ఉబ్బసం రోగులకు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చెప్పమందు పంపిణి చేస్తూ ఉంటారు. ఈ చేప ప్రసాదం కోసం రాష్ట్రం నలుమూలలనుండి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. తెల్లవారి ఝామునుండే లైన్ లో బారులు తీరుతారు. బత్తిని మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాలప్రజలు తమ సంతాపం తెలియజేస్తున్నారు.