Advertisementt

గాండీవధార అర్జున ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్

Fri 25th Aug 2023 04:24 PM
gandeevadhari arjuna  గాండీవధార అర్జున ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Gandeevadhari Arjuna OTT Partner Revealed గాండీవధార అర్జున ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్-సాక్షి వైదే జంటగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గాండీవధార అర్జున నేడు ఆగష్టు 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షోకే సినిమాపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వ లోపాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయని, ఘోస్ట్ కన్నా ఈ చిత్రం మరింతగా వీక్ అని క్రిటిక్స్ రివ్యూస్ ఇస్తుంటే.. పబ్లిక్ కూడా సినిమాలో ఎలాంటి విషయము లేదని తేల్చేస్తున్నారు. 

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన గాండీవధార అర్జున చిత్రం థియేటర్స్ లో విడుదల కాకమునుపే ఈ చిత్రంపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఆ పోటీలో భాగంగానే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది. 

అయితే నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారట. ఈరోజు ఆగస్టు 25న విడుదలైన గాండీవధారి అర్జున సెప్టెంబర్ చివరి వారంలో ఓటిటీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.

Gandeevadhari Arjuna OTT Partner Revealed:

Varun Tej Gandeevadhari Arjuna locks its OTT partner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ