Advertisementt

బీజేపీ స్కెచ్‌కి ఈటల, బండి బలి!

Sun 03rd Sep 2023 08:49 PM
etala,bandi sanjay,brs,bjp,sketch,kcr,ktr,telangana  బీజేపీ స్కెచ్‌కి ఈటల, బండి బలి!
Etala and Bandi Sanjay in BJP Trap బీజేపీ స్కెచ్‌కి ఈటల, బండి బలి!
Advertisement
Ads by CJ

మోదీ, అమిత్ షా ద్వయం ముందు ఎంతటి రాజకీయ చాణక్యుడు అయినా తలవంచాల్సిందే. అలా ఉంటుంది వారి స్కెచ్. ఇప్పుడు తెలంగాణలో వారు తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు పోటీ నుంచి బీజేపీ తప్పుకుందని.. కేవలం నామ్కే వాస్తే పోటీ చేస్తోందన్న టాక్ నడుస్తుంటే.. ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇద్దరు కీలక నేతలను పనిగట్టుకుని మరీ అధిష్టానం బలి చేయబోతోందా? అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. అసలు బీజేపీ ఏం నిర్ణయం తీసుకుంది? తెలంగాణలో ఏం చేయబోతోంది? ఏ కీలక నాయకులను బలి చేసేందుకు సిద్ధమవుతోంది? వంటి అంశాలపై ప్రత్యేక కథనం.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీచేసే స్థానాలే ప్రధాన టార్గెట్‌గా బీజేపీ భారీ స్కెచ్ గీస్తోందని టాక్ అయితే నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ 15 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ అయితే ఇంటర్నల్‌గా రెడీ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ ఫస్ట్ లిస్ట్‌లోనే తెలంగాణ బీజేపీ కీలక నేతలంతా ఉండటం విశేషం. ఈ 15 మంది కూడా తెలంగాణ సీఎంతో పాటు మంత్రి కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు కీలక నేతలను టార్గెట్ చేయనున్నారు. మొత్తానికి బీజేపీ సంచలన అభ్యర్థిత్వాలను అయితే రెడీ చేసేసింది.  ప్రస్తుతం తెలంగాణలో బీజేపీలో స్ట్రాంగ్ లీడర్స్ అంటే బండి సంజయ్, ఈటల రాజేందర్. వీరు ముఖ్యంగా ఎవరిపై పోటీ చేయనున్నారో తెలిస్తే షాక్ అవడం ఖాయం. సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్.. మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ పోటీ చేయనున్నారని టాక్.

హరీష్ రావుపై సిద్దిపేటలో మాజీ ఎంపీ బూర నర్సయ్య్ గౌడ్ లేదా మురళీధర్‌రావును నిలబెట్టాలనే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు టాక్. ఈటల అయితే కేసీఆర్‌పై పోటీ చేయాలని గత కొంతకాలంగా ఉవ్విళ్లూరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన తరచూ గజ్వేల్‌కు వెళ్లొస్తున్నారు. నిజానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులపై పోటీ అంటే మామూలు విషయం కాదు.. దాదాపు వీరికి ఎదురు నిలిచి గెలవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాంటిది.. తెలిసి తెలిసి కీలక నేతలను కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులపై నిలబెట్టడమంటే.. వారిని బలి చేయడమేనన్న టాక్ నడుస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. అయితే ఏ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. 

Etala and Bandi Sanjay in BJP Trap:

BJP leadership to sacrifice Etala and Bandi Sanjay?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ