Advertisementt

ఫైనల్లీ ఉస్తాద్ సెట్స్ లోకి పవన్

Thu 07th Sep 2023 04:33 PM
ustaad bhagat singh  ఫైనల్లీ ఉస్తాద్ సెట్స్ లోకి పవన్
Ustaad Bhagat Singh Massive Action Schedule Begins ఫైనల్లీ ఉస్తాద్ సెట్స్ లోకి పవన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ ని మెప్పించే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. ఈ చిత్రంలో హీరో ఉపయోగించే ఆయుధాలన్నింటినీ రివీల్ చేస్తూ ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ పోస్టర్‌ను షేర్ చేశారు. దాదాపు ఆరు నెలలుగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి ఇదిగో అదిగో వెళుతున్నా అంటున్న పవన్ కళ్యాణ్ ఈరోజు షూట్‌లో జాయిన్ అయ్యారు. 

ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ మాసీవ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్‌లో షేడ్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి అండ్ టీమ్ మాసీవ్ సెట్‌ని రూపొందించారు.

మాస్ పల్స్‌ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి మాస్‌ను మెప్పించే సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో టెర్రిఫిక్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. 

Ustaad Bhagat Singh Massive Action Schedule Begins:

 Pawan Kalyan, Harish Shankar Ustaad Bhagat Singh Massive Action Schedule Begins

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ