ఈమధ్యన అట్టర్ ప్లాప్ మూవీస్ ఓటిటిలోకి రావడానికి చాలా ఆలోచిస్తున్నాయి. థియేటర్స్ లో హిట్ అయిన మూవీస్ ని ఓటిటీలో విడుదల చేసేందుకు మేకర్స్ ఆలోచించాల్సింది పోయి.. అట్టర్ ప్లాప్ మూవీస్ మాత్రం ఓటిటీలోకి అడుగుపెట్టడానికి ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. అందులో ముఖ్యంగా అఖిల్ ఏజెంట్ మూవీ, గోపీచంద్ రామబాణం మూవీస్ అలాగే ఓటిటిలోకి రావడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నాయి.
అయితే ఇప్పుడు గోపీచంద్ అట్టర్ ప్లాప్ మూవీ రామబాణం ఓటిటిలోకి వచ్చెందుకు రెడీ అయ్యింది. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ రామబాణం సినిమాని ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. అప్పటినుండి ఈ సినిమా ఓటిటిలోకి ఎప్పుడొస్తుందా అని కొంతమంది ఉత్సుకత చూపించారు. కానీ చాలా సమయం తీసుకుని ఈ సినిమా ఓటిటీ ఎంట్రీకి రెడీ అయ్యింది.
ఈ చిత్రం సెప్టెంబర్ 14న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఎట్టకేలకి ఈ ప్లాప్ మూవీ వచ్చే గురువారం రామబాణం ఓటిటీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.