Advertisementt

Bigg Boss: ఆ బ్యూటీనే వెళ్లిపోతుందా?

Mon 11th Sep 2023 12:14 AM
bigg boss,telugu,season 7,elimination,kiran rathore  Bigg Boss: ఆ బ్యూటీనే వెళ్లిపోతుందా?
Bigg Boss Telugu 7 First Elimination Done Bigg Boss: ఆ బ్యూటీనే వెళ్లిపోతుందా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదటి వారం పూర్తి చేసుకుంది. వారం పూర్తయిందంటే ఎలిమినేషన్స్ ఉంటాయి కదా.. ఇప్పుడా సందడే నెలకొంది. లాస్ట్ సండే.. కంటెస్టెంట్స్ ఎవరా అని అంతా బిగ్‌బాస్‌పై దృష్టి పెడితే.. ఈ వారం బయటికి పోయేది ఎవరా? అనే ఆతృతతో ఉన్నారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌లో ఈ వారం 8 మంది ఎలిమినేషన్స్‌కి నామినేట్ కాగా.. అందులో 6గురు శనివారం ఎపిసోడ్‌లో సేఫ్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. మిగిలిన ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

మొత్తం 8 మంది ఎలిమినేషన్‌కి నామినేట్ కాగా.. అందులో పువ్వులు, అస్థిపంజరం గేమ్‌తో 6గురుని సేఫ్ చేశాడు హోస్ట్ నాగార్జున. ఈ ఎనిమిది మందిలో 6గురుకి పువ్వులు రాగా.. వారు ఎలిమినేషన్‌ నుంచి బయటపడ్డారు. అస్థిపంజరం వచ్చిన ఇద్దరిలో ఒకరు ఈ వారం హౌస్ వదిలి వచ్చేయబోతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరని అనుకుంటున్నారా? ప్రిన్స్ యావన్, హీరోయిన్ కిరణ్ రాథోడ్. ఈ ఇద్దరూ ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతోంది హీరోయిన్ కిరణ్ రాథోడ్ అని తెలుస్తోంది.

ఈ బ్యూటీనే సీజన్ 7‌లో ఫస్ట్ బయటికి వచ్చేసే కంటెస్టెంట్ అని టాక్ నడుస్తోంది. అందుకు కారణం ఆమెకు వచ్చిన ఓటింగే అని సమాచారం. ఈ భామకు ఓటింగ్ తక్కువ రావడానికి కారణం.. ప్రోపర్ తెలుగు రాకపోవడం. హౌస్‌లో ఎక్కువగా ఇంగ్లీష్‌నే మాట్లాడుతుండటం.. అలాగే మిగతా కంటెస్టెంట్స్ చెప్పేది కూడా అర్థం చేసుకోలేకపోవడంతో.. ఈ షో చూస్తున్న జనాలు ఈ బ్యూటీని ఎంకరేజ్ చేయలేదని తెలుస్తోంది. అందుకే బిగ్‌బాస్ ఈ వారం ఆమెని హౌస్‌ నుంచి పంపేస్తున్నట్లుగా టాక్ వినబడుతోంది. మరి ఏ విషయం కాసేపట్లో నాగార్జున తేల్చేస్తాడు కాబట్టి.. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టక తప్పదు.

Bigg Boss Telugu 7 First Elimination Done:

Bigg Boss Telugu 7 First Week Elimination Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ