Advertisementt

సింపతీ వర్కౌట్ అవ్వట్లేదు!

Tue 12th Sep 2023 12:00 PM
bigg boss 7  సింపతీ వర్కౌట్ అవ్వట్లేదు!
Sympathy does not work out! సింపతీ వర్కౌట్ అవ్వట్లేదు!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ అంటే గతంలో బుల్లితెర ప్రేక్షకుల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎవ్వరిలో కనిపించడం లేదు. మొదటి రెండు మూడు సీజన్స్ ని ఆదరించిన ప్రేక్షకులు తర్వాత సీజన్స్ ని పిచ్చ లైట్ తీసుకున్నారు. ఈ 7వ సీజన్ పై అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యం ఏదో తంటాలు పడ్డారు. ఈ నెల 3 న మొదలైన బిగ్ బాస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. మొదటివారంలో తెలుగు మాట్లాడని కారణంగా ఇంటి సభ్యులు కిరణ్ రావు ని టార్గెట్ చేసి ఇంటికి పంపించారు. 

ఇక మిగతా వాళ్ళు కూడా బిగ్ బాస్ గత సీజన్స్ ని వీక్షించి అందుకు అనుగుణం సింపతీ గేమ్ మొదలు పెట్టారు. రైతు బిడ్డని అని చెప్పుకునే ప్రశాంత్ హౌస్ లో ఒకలా నామినేషన్స్ లో మరోలా బిహేవ్ చెయ్యడం హౌస్ సభ్యులకి ఏమాత్రం నచ్ఛలేదు. దానితో గత రాత్రి రెండో వారం నామినేషన్స్ లో ఫుల్ గా టార్గెట్ చేసారు. నటుడు శివాజీని, ప్రశాంత్ ని ఇద్దరినీ హౌస్ మేట్స్ టార్గెట్ చేసారు. 

రైతు బిడ్డ అంటూ కళ్ళ నీళ్లు పట్టుకున్న ప్రకాష్ ని చూసిన ప్రేక్షకులు కూడా ఇదేదో సింపతీ గేమ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. మిగతా హౌస్ మేట్స్ కూడా అతని ముసుగు తీసే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా అమరదీప్ అతన్ని వదలకుండా అతని గేమ్ మొత్తాన్ని బయటపెట్టేసాడు. మరి ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సింపతీ పెద్దగా వర్కౌట్ అవ్వదనే భావన బాగా కలుగుతుంది. చూద్దాం మిగతా వారాల్లో బిగ్ బాస్ సీజన్ 7 ఎలా ఉంటుందో.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది.  

Sympathy does not work out!:

Bigg Boss 7: yesterday episode highlights

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ