Advertisementt

బిగ్ బాస్ 7: నిన్న రతిక నేడు ప్రిన్స్ రచ్చ

Fri 15th Sep 2023 10:48 AM
bigg boss 7  బిగ్ బాస్ 7: నిన్న రతిక నేడు ప్రిన్స్ రచ్చ
Bigg Boss 7: Yesterday Rathika is Prince today బిగ్ బాస్ 7: నిన్న రతిక నేడు ప్రిన్స్ రచ్చ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 మొదలై రెండు వారాలైంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ గేమ్ ఆడేసి, నోరేసుకుని పడిపోయి బిగ్ బాస్ టైటిల్ పట్టుకెళ్లాలని చూస్తున్నారు. కంటెస్టెంట్స్ అందరూ గేమ్ స్ట్రేటజీ ప్లే చేస్తున్నారు. అమరదీప్, శోభా శెట్టి, రతిక, గౌతమ్, సందీప్ మాస్టర్, శివాజీ, ప్రిన్స్, పల్లవి ప్రశాంత్ ఇలా ఎవ్వరూ తగ్గట్లేదు. గత రాత్రి హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రెండు గ్రూప్స్ ల్లో రణధీరా గ్రూప్ లోని రతిక చేసిన రచ్చతో గేమ్ ఆగిపోయింది. 

సందీప్ మాస్టర్-రతిక ఇద్దరూ నువ్వా-నేనా అని పోట్లాట పెట్టుకున్నారు. రతిక అయితే ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టింది. మా టీం అంతా బఫూన్స్ అంటూ ఎద్దేవా చేసింది.  ఇక రతిక వలన అమరదీప్ ఈ టాస్క్ నుండి బయటికెళ్లాల్సి రావడంతో అమరదీప్ గోల గోల చేసాడు. రతిక వలన తన ఆట ఆగిపోయింది అన్నాడు. ఇక ఈరోజు ప్రిన్స్ ని గేమ్ నుంచి తప్పించడంతో ప్రిన్స్ కూడా రెచ్చిపోయాడు. రీసెంట్ గా ఇంగ్లీష్ ఇంకా అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడని అతనికి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు.

ఈరోజు ఎపిసోడ్ లో అతన్ని గేమ్ నుంచి తపించడంతో ప్రిన్స్ రెచ్చిపోయి గౌతమ్ పైకి వెళ్ళాడు. గౌతమ్ కూడా తగ్గలేదు. ఇక ఇది అన్ ఫెయిర్ గేమ్ బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ గేట్స్, నేను బయటికెళ్ళిపోతాను, ఎవ్వరూ బాగా ఆడట్లేదు అంటూ రెచ్చిపోయాడు. మరి బిగ్ బాస్ లో అసలు ఆట కన్నా ఈ రచ్చే ఎక్కువగా హైలెట్ అవుతుంది. 

Bigg Boss 7: Yesterday Rathika is Prince today:

Bigg Boss 7 update 

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ