కాంతార తో కన్నడ నుంచి మెల్లగా ప్యాన్ మార్కెట్ లోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించాడు రిషబ్ శెట్టి. డైరెక్టర్ రిషబ్ శెట్టి హీరోగా మారి ఆ చిత్రాన్ని దర్శహకుడిగా 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు. అటు దర్శకుడిగా ఇటు హీరోగా నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. ఆ తర్వాత కాంతార కి ప్రీక్వెల్ అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే కాంతార కి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ప్రకటించడంతో అందరి ఆసక్తి ఎక్కువైంది.
అందుకు అనుగుణంగా కాంతార ప్రీక్వెల్ కి ప్లాన్ చేసుకొన్నాడు రిషబ్ శెట్టి. అయితే ఆ చిత్రాన్ని ఇంకా సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు. ఈ చిత్రానికి సంబంధించిన ఏ న్యూస్ వినిపించినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కాంతారా ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి ప్రాణం పెట్టి మరీ కష్టపడుతున్నాడు.
తన పాత్రకి సరిపోయేలా ఫిట్ గా ఉండేందుకు రిషబ్ శెట్టి దాదాపు 11 కేజీల బరువు తగ్గాడట. దీని కోసం రిషబ్ చాలా శ్రమించాడని చెబుతున్నారు. ఇక కాంతార ప్రీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్హయ్యింది అని, అతి త్వరలోనే ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి పట్టాలెక్కించబోతున్నట్లుగా సమాచారం. అది నవంబర్ లో ఉండే అవకాశం ఉంది అంటున్నారు.