రేపు సోమవారం వినాయకచవితి సందర్భంగా మహేష్ అభిమానులకి ట్రీట్ ఇచ్చేందుకు త్రివిక్రమ్ అండ్ థమన్ సిద్ధమయ్యారు. ఎప్పుడో మహేష్ పుట్టిన రోజుకే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ వస్తుంది అన్నప్పటికీ.. అది ఇప్పుడు వినాయకచవితికి షిఫ్ట్ అయ్యింది. అయితే వినాయక చవితికైనా పక్కాగా గుంటూరు కారం నుంచి ఏమైనా సర్ ప్రైజ్ ఉందో.. లేదో అనేది అభిమానులకి క్లారిటీ లేదు.
అయితే మేకర్స్ ఈ వినాయకచవితికి ముందుగా మహేష్ బాబు-హీరోయిన్ శ్రీలీల కలిసి ఉన్న డ్యూయెట్ వదలాలి అనుకున్నారట. కానీ ఆ పాట చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో ఇప్పుడు ప్లాన్ మార్చి ఫస్ట్ సింగిల్ గా మహేష్ సోలో సాంగ్ వదలాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ వినాయకచవితికి మహేష్ అభిమానులు హీరోగారి సోలో సాంగ్ తో ట్రీట్ అందుకోబోతున్నారు. ఇక ఆగుతారా సోషల్ మీడియాలో రచ్చ చేయరూ..
మహేష్ బాబు ఫస్ట్ లుక్, బర్త్ డే టీజర్ అన్ని సోషల్ మీడియాని షేక్ చేసాయి. ఇప్పుడిక సింగిల్ కూడా వస్తే ఫాన్స్ కి పండగే. కాకపోతే మహేష్-శ్రీలీల డ్యూయెట్ వస్తే వాళ్ళు ఇంకాస్త హ్యాపీగా ఫీలయ్యేవారు.