Advertisementt

ఫీవర్ తో సఫర్ అవుతూనే అనసూయ ఫైర్

Sun 17th Sep 2023 01:37 PM
anchor anasuya bharadwaj  ఫీవర్ తో సఫర్ అవుతూనే అనసూయ ఫైర్
Anasuya suffering with fever ఫీవర్ తో సఫర్ అవుతూనే అనసూయ ఫైర్
Advertisement
Ads by CJ

అనసూయ కొద్దిరోజులుగా వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నాను.. అది మానసిక ప్రశాంతత కోసమే అంటూ ప్రతి ప్రెస్ మీట్లో చెప్పుకొస్తుంది. అయితే అనసూయ ఓ ఐదు రోజులుగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఏదో ఒక ఫొటో షూట్ తోనో, లేదంటే ఏదో ఒక కాంట్రావర్సీతోనో కనిపించే అనసూయ ఇప్పుడు కొద్ధి రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉండడంతో అందరూ అనసూయకి ఏదో అయ్యింది అనుకున్నారు. 

అనసూయకి వైరల్ ఫీవర్ అంట. గత ఐదు రోజులుగా తాను జ్వరంతో బాధపడుతున్నాను అని, అందుకే సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను అని చెప్పిన అనసూయ ఈ గ్యాప్ లో చాలా గ్రహించాను, నిర్దయగా వ్యవహరించడం, సాటి మనుషుల పట్ల జాలి, దయ లేకపోవడం ఇదంతా గమనించాను, అసలు మనం ఎటువైపు వెళుతున్నాం అంటూ ట్వీట్ చేసింది. 

అంతేకాకుండా ఇప్పుడు స్టార్స్ గా ఓ వెలుగు వెలుగుతున్నవారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్న వారే. ఎటువంటి పీఆర్ ప్రమోషన్స్ లేకుండా తమకి తాముగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. అంతేకాని వారి అభిమానులమని చెప్పుకుని వారి పరువు తియ్యొద్దు. విమర్శించడం మంచిదే. కానీ అది గౌరవంగా ఉండాలి. బహిరంగంగా బూతు పదాలు వాడొద్దు. బాధ్యతగా వ్యవహరించండి అంటూ అనసూయ జ్వరంతోనే బాధపడుతూ ఫైర్ అవుతుంది. 

Anasuya suffering with fever:

Anchor Anasuya Bharadwaj Suffering With Viral Fever

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ