టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇక నెక్ట్స్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అరెస్ట్ చేస్తారని అంటున్నారు. అసలు గత రాత్రే ఆయనను ఢిల్లీలో అరెస్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం నడిచింది. ఇక ఆయనను కూడా అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అయితే యాక్టివ్ అయిపోయారు కానీ ఆయనది కాస్త దూకుడు స్వభావం. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర న్యూస్ టీడీపీ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఒకవేళ నారా లోకేష్ అరెస్ట్ అయితే టీడీపీ బాధ్యతలు నారా బ్రాహ్మణికి అప్పజెబుతారని టాక్. ఈ న్యూస్ ఎవరో కాదు.. ఏకంగా.. టీడీపీలో కీ రోల్ పోషిస్తున్న అయ్యన్న పాత్రుడే చెప్పడంతో ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీకి సంక్షోభాలు కొత్తవేం కాదు. ఆది నుంచి ఎదుర్కొంటూనే ఉంది. అయితే ఇది మాత్రం కనివినీ ఎదుర్కొంటోంది. పార్టీ అధ్యక్షుడే జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో చంద్రబాబుపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఏవీ నిరూపణ కాలేదు. ఈసారి కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండానే ఆయనను అరెస్ట్ చేశారు. ఆపై కోర్టులోనూ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరికొన్ని కేసులను సైతం చంద్రబాబుపై మోపే యత్నం చేస్తోంది అధికార వైసీపీ. ఇప్పట్లో చంద్రబాబును బయటకు రానీయకుండా చేసేందుకు పక్కాగా వైసీపీ స్కెచ్ గీస్తోంది. ప్రస్తుతం పార్టీ బాధ్యతలన్నీ నారా లోకేష్ చూస్తున్నారు. ఆయన కూడా అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో బ్రాహ్మిణిని ముందుంచి పార్టీని నడిపిస్తామంటూ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అధికార వైసీపీకి నిజంగా ఇది షాకింగ్ న్యూసే.
వ్యాపారంలో అయితే బ్రాహ్మిణి సక్సెస్. మరి రాజకీయాల్లోనో? అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో ఆమె మీడియా ముందుకు వచ్చారు. పార్టీ కేడర్‌లో జోష్ నింపేలా ఆమె మాట్లాడారు. ఇక బ్రాహ్మిణి ఈసారి పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి? అనే దానిపై కూడా ఏపీలో బీభత్సంగా చర్చ జరుగుతోంది. బ్రాహ్మిణి కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రాని మహిళలు బయటకు వచ్చారంటే ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. చంద్రబాబు అరెస్ట్‌పై సింపతి ఒకవైపు.. ఎప్పుడూ ఎండ కన్ను తెలియని మహిళ వచ్చిందన్నది మరోవైపు జనంలో విపరీతమైన మార్పును తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. బ్రాహ్మిణి రంగంలోకి దిగితే మాత్రం వైసీపీకి చుక్కలే. ఒకప్పుడు జగన్ కోసం ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేస్తే ఎలాంటి స్పందన వచ్చిందో.. బ్రాహ్మిణి రంగంలోకి దిగితే అంతకు మించి వస్తుంది. దీంతో టీడీపీకి విజయం అనేది పక్కా.