పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ ని ఒడిసిపట్టుకుని జాగ్రత్తగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని చకచకా చుట్టేస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. పవన్ ఫాన్స్ పేరుతొ ట్రోల్స్ చేసే వారికి అదిరిపోయే రిప్లై ఇస్తూ సందడి చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ మార్చిలో కొద్దిరోజులు డేట్స్ ఇవ్వగా.. ఆ షెడ్యూల్ లోనే పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ ని రెడీ చేసాడు హరీష్.
ఇక ఇప్పుడు సమయం చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్ హరీష్ కి డేట్స్ ఇవ్వడంతో హరీష్ పవన్ పై ఫోకస్ పెడుతున్నాడు. రేపు మంగళవారం నుంచి సరికొత్త షెడ్యుల్ మొదలు పెట్టబోతున్నారు. ఓ షార్ట్ షెడ్యూల్ కోసం పవన్ డేట్స్ ఇచ్చారట. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాల చిత్రకరణకు హరీష్ శంకర్ రెడీ అవుతున్నారు.
అంటే పవన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఆయనపై ఫోకస్ పెడితే.. తర్వాత ఆయన అందుబాటులో లేకపోయినా.. మిగతా నటులతో షూటింగ్ ఫినిష్ చెయ్యొచ్చు అనేది హరీష్ ప్లాన్. ఇక ఈ చిత్రంలో శ్రీలీల వన్ అఫ్ ద హీరోయిన్ కాగా.. మరో హీరోయిన్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ లో కీలక పాత్రలో కనిపించబోతుంది. దాని కోసమే పూజ హెగ్డే ని అనుకుని.. ఇప్పుడు వెనక్కి తగ్గారంటున్నారు.