Advertisementt

బిగ్ బాస్ 7: కొట్టుకోవడం ఒక్కటే తక్కువ

Tue 26th Sep 2023 09:55 PM
bigg boss 7  బిగ్ బాస్ 7: కొట్టుకోవడం ఒక్కటే తక్కువ
Bigg Boss 7: 4th week nominations బిగ్ బాస్ 7: కొట్టుకోవడం ఒక్కటే తక్కువ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ పెరఫార్మెన్స్ కన్నా గొడవలు, కొట్టుకోవడలపైనే ఎక్కువగా శ్రద్ద పెడుతున్నారు కంటెస్టెంట్స్. సీజన్ 7 కి వచ్చిన వారంతా సీరియల్ ఆర్టిస్ట్ లే. శివాజీ నటుడు, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, సందీప్ డాన్స్ మాస్టర్ ఇక మిగతా వాళ్లంతా సీరియల్ ఆర్టిస్ట్ లే. గోల, అరుచుకోవడంతోనే ఫుటేజ్ వస్తుంది లేదంటే కన్నీళ్ళు ఇలా ఉంది వీరి వ్యవహారం. 

ఇక నాలుగో వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మధ్యన మాటల యుద్ధం మితిమీరిపోయింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా నామినేషన్స్ పరంపర కొనసాగింది. యావర్ ప్రిన్స్ vs టేస్టీ తేజ, యావర్ ప్రిన్స్ vs గౌతమ్, గౌతమ్ vs శివాజీ, సందీప్  మాస్టర్ లు, పల్లవి ప్రశాంత్ vs అమరదీప్, అమరదీప్ vs సుబ్బు, రతిక vs పల్లవి ప్రశాంత్, ప్రియాంక vs ప్రిన్స్.. అమ్మో వీరంతా పెద్ద రచ్చ చేసారు. నామినేషన్స్ లో కొట్టుకున్నంత పని చేసారు.  

గౌతమ్ అయితే షర్ట్ విప్పి, గొడుగు విసిరికొట్టాడు. నువ్వెంత, నువ్వెంత అంటూ శివాజీపై గౌతమ్ రెచ్చిపోయాడు. ఇక పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్ పై అమరదీప్ మరోసారి హాట్ కామెంట్స్ చేసాడు. పల్లవి ప్రశాంత్ కూడా అమరదీప్ పై విరుచుకుపడ్డాడు. ఇక అమరదీప్ తో గొడవపడిన సుబ్బు కన్నీళ్లు పెట్టుకుంది. బాబోయ్ అది బిగ్ బాస్ హౌసా లేదంటే పశువుల సంతా అనేది అర్ధం కాక బుల్లితెర ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు.  

Bigg Boss 7: 4th week nominations:

Bigg Boss 7 Telugu 4th Week Nominated Contestants

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ