గుంటూరు కారం సింగిల్ కోసం మహేష్ అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా భగవంత్ కేసరి ఆర్.ఆర్.ఆర్ వర్క్ ని, గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ని రెడీ చేస్తున్నారు, క్షణం తీరిక లేకుండా వాయిస్తున్నాడు అంటున్నారు. వినాయక చవితికి గుంటూరు కారం నుంచి సర్ ప్రైజ్ ని మహేష్ ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేసారు. కానీ అప్పుడు మిస్సయ్యింది. ఇప్పుడు గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ అవుతున్నట్టుగా నిర్మాత నాగవంశీ ఓ ఈవెంట్ లో చెప్పారు.
దానితో మహెష్ ఫాన్స్ మళ్ళీ అలెర్ట్ అయ్యారు. దసర ఫెస్టివల్ కన్నా ముందే మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఉండబోతుంది అంటూ నాగవంశీ చెప్పడంతో అభిమానులు హ్యాపీగా మోడ్లోకి వెళుతున్నారు. హీరోగారి ఇంట్రెడెక్షన్ సాంగ్ ని వదులుతారనే గాసిప్ ఉంది.
అయితే మహేష్ అభిమానులకి మహేష్ ని-శ్రీలీలని సింగిల్ ఫ్రేమ్ లో చూడాలని కోరిక ఉంది. అంటే వాళ్ళు కలిసి ఆడిన డ్యూయెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి దానికి సంబందించిన చిత్రీకరణ పూర్తికాకపోవడంతో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ని వదిలేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.