పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు.. ఇంకేంటి ఇక ఏపీ రాజకీయాల్లో కొత్తవరవడి సృష్టిస్తారు.. టీడీపీ దోస్తీని అఫీషియల్‌గా ప్రకటించారు.. ఇకపై ఉమ్మడిగానే పోటీకి సిద్ధమయ్యారు. బాలయ్య-లోకేష్‌లతో కలిసి చంద్రబాబుని కలిసి పొత్తుని అధికారికంగా ప్రకటించారు. ఇకపై ఏపీలో దబిడి దిబిడే అంటూ మీడియా కూడా హడావిడి చేసింది. మరి పవన్ కళ్యాణ్ చేసిన హంగామా అలాంటిదే.
కానీ ఇప్పుడు ఆయన రాజకీయాలను పక్కనపెట్టి సినిమాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఇంకా జైలులోనే ఉన్నారు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యి 21 రోజులవుతుంది. అటు చూస్తే లోకేష్ అరెస్ట్‌కి రంగం సిద్ధమవుతుంది. ముందస్తు బెయిల్ కూడా రాలేదు. ఇలాంటి టైమ్‌లో పాలిటిక్స్ పరంగా యాక్టివ్‌గా ఉండాల్సిన పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ చేసుకుంటున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్ర షూటింగ్స్‌తో బిజీ అయ్యారు. పొలిటికల్‌గా కామ్‌గా కనబడుతున్న పవన్ కళ్యాణ్‌పై ఎప్పుడు యాక్టివ్ అవుతారు బ్రో అంటూ కామెంట్స్ పడుతున్నాయి. కానీ పవన్ మాత్రం చంద్రబాబు, లోకేష్‌లపై ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్‌గా తన పనిలో బిజీగా వున్నారు.