Advertisementt

జబర్దస్త్ లోకి ఫైమా రీ ఎంట్రీ

Tue 03rd Oct 2023 04:07 PM
faima  జబర్దస్త్ లోకి ఫైమా రీ ఎంట్రీ
Faima re-entry into Jabardasth జబర్దస్త్ లోకి ఫైమా రీ ఎంట్రీ
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో కామెడీ చేసే ఫైమా అందం కానీ, ఆకర్షణ కానీ లేకపోయినా తన టాలెంట్ తో కామెడీతో బుల్లితెర ప్రేక్షకుల మనసులని దోచుకుంది. భాస్కర్ స్కిట్ ద్వారా కమెడియన్ గా ఈటీవీలో తెగ ఫేమస్ అయిన ఫైమా గత ఏడాది స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. బిగ్ బాస్ లోను తనదైన కామెడీతో ఆకట్టుకుంది. 

సన్నగా ఉన్నా విల్ పవర్ ఉంటుంది.. అంటూ తన స్టామినా చూపిస్తూ బిగ్ బాస్ లో టాప్ 5 వరకు పోరాడి చివరి వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత స్టార్ మాలో BB జోడితో సూర్య తో కలిసి డాన్స్ లో ఇరగదీసిన ఫైమా గత నెలలో కొత్తింటి గృహప్రవేశం చేసి తన కలను సాకారం చేసుకుంది. 

అయితే బిగ్ బాస్ కి వెళ్లి ఏడాది అగ్రిమెంట్ పూర్తి కాగానే ఫైమా మరోసారి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ పై కామెడీ చేస్తూ కనిపించింది. అది కూడా బుల్లెట్ భాస్కర్ స్కిట్ లోనే కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చేసింది. వచ్చే శుక్రవారం జబర్దస్త్ స్టేజ్ పై మళ్ళీ ఫైమా కామెడీ ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. 

Faima re-entry into Jabardasth:

Faima Back to Jabardasth

Tags:   FAIMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ