Advertisementt

మరో అర్ధ శతాబ్దం ఇదే ఎనర్జీ: చిరు

Fri 06th Oct 2023 10:33 AM
chiranjeevi,megastar,satyanand,50 years journey  మరో అర్ధ శతాబ్దం ఇదే ఎనర్జీ: చిరు
Megastar Chiranjeevi Wishes to Satyanand for Completed 50 Years Cine Journey మరో అర్ధ శతాబ్దం ఇదే ఎనర్జీ: చిరు
Advertisement
Ads by CJ

రచయిత, స్క్రిప్ట్ డాక్టర్‌ సత్యానంద్‌ తన సినీ ప్రస్థానం‌లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలో సత్యానంద్ పేరు, ఆయన పాత్ర ఏమిటనేది తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. మెగాస్టార్ ఫ్యామిలీతోనే కాకుండా.. ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆయన పరిచయస్తుడు. మెగాస్టార్ రీ ఎంట్రీ సమయంలో సత్యానంద్ పాత్ర చాలానే ఉంది. ఇప్పటికీ మెగాస్టార్ సినిమా చేస్తున్నాడంటే.. ఆ సినిమా కథని ఒకసారి సత్యానంద్ పరిశీలిస్తుంటారు. అలాంటి రచయితని.. నాకు అత్యంత ఆప్తులు అంటూ మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

‘‘ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్‌గా వుంటూ, ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు, నటులకు ఒక మెంటోర్‌గా, ఒక గైడింగ్ ఫోర్స్‌గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా వుంటూ, సినిమాని ప్రేమిస్తూ, సినిమానే ఆస్వాదిస్తూ, సినిమాని తన జీవన విధానంగా మలచుకున్న నిత్య సినీవిద్యార్ధి, తరతరాల సినీ ప్రముఖులoదరికీ ప్రియ మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి, సౌమ్యులు, సత్యానంద్‌గారు తన సినీ ప్రస్థానం‌లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు. ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం, నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో  ప్రగాఢమైనది.

Dearest Satyanand Garu.. మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని, సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్తగా, మరో అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ‌తో ఉండాలని ఆశిస్తున్నాను. More Power to You!’’ అని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Megastar Chiranjeevi Wishes to Satyanand for Completed 50 Years Cine Journey :

Megastar Chiranjeevi Tweeted on Satyanand 50 Years Cine Journey

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ