తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన రతిక.. లాస్ట్ సండే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమె ఎలిమినేట్ అవడానికి కారణం వెన్నుపోటు. రైతు బిడ్డగా హౌస్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌కు ఆమె వెన్నుపోటు పొడిచిన తీరు, ప్రిన్స్ యావర్ విషయంలో ఆమె బిహేవియర్, హౌస్‌లో తన అవసరం కోసం నడిపిన లవ్ ట్రాక్స్ వంటి వన్నీ.. ఈ షో చూసే వారికి నచ్చలేదు. అందుకే.. ఆమెకు ఓటింగ్ వేయకుండా ఎలిమినేట్ అయ్యేలా చేశారు. ఈ విషయం స్వయంగా కింగ్ నాగార్జునే చెప్పారు. మరి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అంటే.. ఎవరైనా షాక్ అవుతారు. ఇప్పుడో యంగ్ హీరో కూడా ఇదే విషయంలో షాక్ అయ్యారు.
ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన రూల్స్ రంజన్ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా సరదాగా కాసేపు నెటిజన్లతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్‌లో ఓ నెటిజన్.. రూల్స్ రంజన్ హిట్ అయిన తర్వాత బిగ్ బాస్ ఫేమ్ రతిక లాంటి అమ్మాయితో నీకు పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నా.. ఆల్ ద బెస్ట్ అని కామెంట్ చేశాడు. దీనికి షాకైన కిరణ్.. బాబు గుడుంబా.. ఎందుకమ్మా నా మీద నీకు అంత పగ. పెళ్లి అయితే చేసుకుందాం కానీ, రాని ఎలాంటి అమ్మాయి వస్తుందో చూద్దాం.. అంటూ రియాక్ట్ అయ్యాడు. అంతే దీనికి నెటిజన్లు సరదాగా కిరణ్ అబ్బవరంపై కామెంట్స్ కురిపిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే.. ఇప్పుడున్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం సొంత టాలెంట్‌తో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పెద్ద పెద్ద బ్యానర్స్‌లో ఆయన సినిమాలు చేస్తున్నాడు. అక్టోబర్ 6న విడుదల కాబోతోన్న రూల్స్ రంజన్ సినిమాకి ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం సమర్పకులుగా ఉన్నారు. ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటించగా.. ఏఎమ్ రత్నం తనయుడు రత్నం కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.