నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఈ నెల 19న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ప్రస్తుతం భగవంత్ కేసరి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో స్టార్ట్ అయ్యాయి. సాంగ్స్ అలాగే రేపు 8న భగవంత్ కేసరి ట్రైలర్ అంటూ టీమ్ హంగామా చేస్తుంది. ఈ దసరా భగవంత్ కేసరితో నందనమూరి అభిమానులు ధూమ్ ధామ్‌గా పండగ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటున్నారు.
ఇంతలో ఈ దసరా పండగ స్పెషల్‌గా నందమూరి ఫాన్స్‌కి మరో ట్రీట్ రెడీ కాబోతుంది అనే న్యూస్ వాళ్ళని భూమ్మీద నిలవనీయడం లేదు. ఆహాలో అన్‌స్టాపబుల్ అంటూ గత రెండు సీజన్స్‌గా హోస్ట్ చేస్తూ బాలయ్య టాక్ షో లో తనదైన మార్క్ చూపెడుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలతో, పొలిటికల్ లీడర్స్‌తో అల్లు అరవింద్ ఆహా ఓటీటీ కోసం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్నారు. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తయ్యాయి.
ఇక ఇప్పుడు మూడో సీజన్ కోసం బాలయ్య మరోసారి ఆహా వారికి సైన్ చేసినట్లుగా టాక్. తదుపరి మొదటి ఎపిసోడ్ కోసం ఆహా వారు అన్ని ఏర్పాట్లను మొదలు పెట్టెయ్యడమే కాదు.. ఈ దసరాకి మొదటి ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలతో నందమూరి అభిమానులు అయితే మాకు ఈ దసరాకు డబుల్ బొనాంజా అంటూ తెగ ఉత్సాహపడిపోతున్నారు. మరి ఈ సీజన్‌లో మెగాస్టార్, జూనియర్ ఎన్టీఆర్‌లని బాలయ్య ఆటాడించాలనేది అటు ఎన్టీఆర్ ఇటు మెగా అభిమానుల కోరిక.