బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే ఐదో వారం పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం ముగిసేసరికి హౌస్ లోకి మరికొంతమంది కంటెస్టెంట్స్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసింది స్టార్ మా. ఈ ఆదివారం అక్టోబర్ 8 ఆదివారం కొంతమంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు యాజమాన్యం ప్లాన్ చేసింది. దాని కోసం పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసారు కూడా. అయితే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది బిగ్ బాస్ హౌస్ లో.
అందులో టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, సందీప్ మాస్టర్, గౌతమ్ మధ్యలో ఫైనల్ టాస్క్ పడింది. ఈవారం కెప్టెన్ ఎవరవుతారో వారు రంగు పడుద్ది గేమ్ ఆడాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక సంచాలక్ గా ప్రియాంకని నియమించాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో సందీప్ మాస్టర్ షర్ట్ మీద ఎక్కువ రంగు పడింది. దానితో మాస్టర్ ని ఎలిమినేట్ చేసింది ప్రియాంక. దానితో సందీప్ ఫైర్ అయ్యాడు.
ఇక గౌతమ్, పల్లవి ప్రశాంత్ కూడా గొడవ తారాస్థాయిలో అంటే ఒకరి మీద ఒకరు పది కొట్టుకునేంతగా కొట్లాడారు. ఈ ఫైనల్ టాస్క్ లో ఎవరు కెప్టెన్ అవుతారో అనేది ఉత్కంఠగా మారింది. మరి ఈ వారం ఇంత కొట్లాట మధ్యన కెప్టెన్ గా ఎవరు నిలవబోతున్నారో చూద్దాం.