రాజా వారు రాణి గారు తో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతోనే బోలేడన్ని అవకాశాలను ఒడిసిపట్టుకుని Sr కళ్యాణమండపంతో హీరోగా సెటిల్ అయిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తున్నాడు.. వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. కానీ అతనికి సక్సెస్ మాత్రం ఆమడదూరంలోనే ఆగిపోతుంది. కారణం హరిబరిగా అతను చేస్తున్న సినిమాలు, కథల ఎంపికలో లోపాలు.
అంతేకాదు.. కిరణ్ అబ్బవరం రొటీన్ లుక్స్, అంతే రొటీన్ యాక్టింగ్, నటనలో పరిపక్వత లేదు, సినిమా సినిమాకి మెరుగవ్వాల్సిన నటన.. అదే రొటీన్ బాటలో కనిపించడం. నేను మీకు బాగాకావాల్సిన వాడిని, మీటర్, వినరో భాగ్యము విష్ణు కథ, సమ్మతమే ఇలా వరసగా సినిమాలు చేసినా అవి డిజాస్టర్స్ అయ్యాయి.
తాజాగా రూల్స్ రంజన్ కూడా అదే బాటలో పయనిస్తుంది. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి ఎలాంటి రివ్యూస్ వచ్చినా.. కిరణ్ నటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు ఎంతమైనసో.. హీరో గారు అంతే మైనస్ అనే మాట బలంగా వినిపిస్తోంది. కిరణ్ అబ్బవరం జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చేసింది
నటన మరీ సాదాసీదాగా మారిపోతోంది.. రూల్స్ రంజాన్ సినిమాలో మరీనూ. ఇలాంటి నటనతో కెరీర్ లో నిలబడడం కష్టం. ఇంత సాదా సీదా నటనతో నెట్టుకురావడం, ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేయాలనుకోవడం పిచ్చితనమే అవుతుంది. కిరణ్ కాస్త ఆలోచించు.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.