మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ నిజంగా అప్పుడే మొదలు కాబోతున్నాయా.. అసలు ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్ జాడ లేదు కానీ.. గుంటూరు కారం ప్రమోషన్స్ పై అప్పుడే ఈ రకమైన న్యూస్ లు చూస్తే మహేష్ అభిమానులకి సంతోషంగా ఉన్నా.. మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకుండా వీటిని నమ్మడానికి లేదు అనే మాట నెటిజెన్స్ నుంచి వినిపిస్తోంది.
అదేమిటంటే సోషల్ మీడియాలో దసరాకి గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టి నాన్ స్టాప్ గా సినిమా విడుదల వరకు అంటే వచ్చే సంక్రాంతి వరకు ప్రమోషన్స్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసారంట. గుంటూరు కారం నుంచి ఒక్కసారి ప్రమోషన్స్ మొదలయ్యాక, ఆ సినిమా లుక్ అండ్ ఫీల్ తెలిసాక.. గుంటూరు కారం మీద పోటీకి దిగుతున్న సినిమాలు చాలావరకు సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటాయని ధీమాగా మేకర్స్ ఉన్నారట.
మరి ఈ నాన్ స్టాప్ ప్రమోషన్స్ మేటర్ లో ఎంత నిజముందో అనేది ఫస్ట్ సింగిల్ విడుదలైతే కానీ చెప్పలేము, ప్రస్తుతం మేకర్స్ ఈ ఫస్ట్ సింగిల్ ని దసరాకైనా లేదంటే దివాళికైనా వదలాలని చూస్తున్నారట.