Advertisementt

భగవంత్ కేసరి లో అవే హైలెట్

Thu 12th Oct 2023 10:15 AM
bhagavanth kesari  భగవంత్ కేసరి లో అవే హైలెట్
Highlight in Bhagavanth Kesari భగవంత్ కేసరి లో అవే హైలెట్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన భగవంత్ కేసరి మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా సెలవలని టార్గెట్ చేస్తూ రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం టీమ్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కాజల్, శ్రీలీల, బాలయ్య అప్పుడప్పుడు మోక్షజ్ఞ భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. 

అన్ స్టాపబుల్ సీజన్ 3 లో టీమ్ మొత్తం హడావిడి చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ హైలెట్ అంటూ వార్తలొస్తున్నాయి. అనిల్ రావిపూడి కామెడీ మార్క్ కి రివర్స్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో అభిమానులకి పూనకాలు తెప్పించే యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అవ్వబోతున్నాయట. భగవంత్ కేసరిలో 8 పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేశారంట. అంతేకాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే హైఅండ్ లో ఉంటుందంట. 

ఇంకా బాలయ్య-శ్రీలీల మధ్యన తండ్రి, కూతుళ్ళ సెంటిమెంట్ కూడా భగవంత్ కేసరి హైలైట్స్ లో ఒకటిగా నిలవబోతుంది అని టాక్. అక్టోబర్ 19 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. 

Highlight in Bhagavanth Kesari:

 Bhagavanth Kesari update 

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ