లోకేష్ కనగరాజ్ LCU లోకి చాలామంది స్టార్ హీరోలు యాడ్ అవుతున్నారు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ ని క్రియేట్ చేసాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లియో మాత్రం LCU లో భాగం కాదని తెలుస్తోంది. అదలా ఉంటే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెలుగు హీరోలైన రామ్ చరణ్, ప్రభాస్ కూడా ఆన్నారు. వాళ్లతో సినిమాలు ఎప్పుడు తెరకెక్కిస్తారనేది మేటర్ కాదు. వారు లోకేష్ డైరెక్షన్ లో చేస్తారనే న్యూస్ అభిమానులని నిలవనియ్యడం లేదు.
తాజాగా లియో ఇంటర్వూస్ లో భాగంగా తమిళ మీడియా లోకేష్ కనగరాజ్ ని ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగింది. లోకేష్ మీ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటివరకు చేయని స్టార్ ని ఎవరిని అయినా పెట్టాల్సి వస్తే మీరు ఎవరిని పెడతారు అని అడగ్గా తాను అజిత్ సర్ తో వర్క్ చేయాలి అనుకుంటున్నాను అంటూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాడు. విజయ్ తో ఎప్పటికప్పుడు పోటీపడే అజిత్ తో లోకేష్ మూవీ చెయ్యాలనుకుంటున్నాను అంటూ చెప్పడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
అంటే లోకేష్ తలచుకుంటే అసాధ్యం కాదు. సో అతి త్వరలోనే లోకేష్ కనగరాజ్ తో అజిత్ సినిమా అనౌన్సమెంట్ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనేది ఆయన అభిమానుల కోరిక.