నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరిగా అడుగుపెట్టేసారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నేలకొండపల్లి భగవంత్ కేసరి అంటూ గర్జిస్తున్నారు. నేడు అక్టోబర్ 19 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంపై సాలిడ్ అంచనాలున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో భగవంత్ కేసరి షోస్ పూర్తవడంతో సోషల్ మీడియాలో మొత్తం ఓవర్సీస్ టాక్ తో, ఫస్ హాఫ్ రిపోర్ట్, సెకండ్ హాఫ్ రిపోర్ట్ అంటూ సందడి మొదలైపోయింది. మరి భగవంత్ కేసరి ఓవర్సీస్ రిపోర్ట్ ఏమిటో.. ఓసారి మనమూ చూసేద్దాం..
భగవంత్ కేసరిలో బాలయ్య ఎంట్రీ రెగ్యులర్‌గా, టిపికల్‌గా కాకూండా చాలా సింపుల్ గా కామెడీగా ఉందట. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్స్ కి ఫాన్స్ కి పూనకాలే అంటూ ఓవర్సీస్ ఆడియన్స్ ఓవరాల్ గా చెబుతున్న మాట. బాలకృష్ణ-శ్రీలీల నడుమ వచ్చే సన్నివేశాలు చూస్తే అచ్చం తండ్రి కూతుళ్ళని చూస్తున్నట్టే ఉంది.. ఎక్కడా నటించిన ఫీలింగ్ రాలేదు, బాలయ్య-శ్రీలీల లది ఆఫ్ స్క్రీన్ కూడా బెస్ట్ కాంబినేషన్. వారి నడుమ భావోద్వేగాన్ని రగిలించే సన్నివేశాలు ఉన్నాయి. ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ భగవంత్ కేసరి అంటూ ట్వీట్ వేస్తున్నారు.
తెలంగాణ యాస, భాష, బ్యాక్ డ్రాప్ సినిమాలో సూపర్బ్. కాకపోతే సినిమాలో సన్నివేశాలు ఊహించుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేసాడు. బాలయ్య ఎలివేషన్స్ బాగున్నాయి. మొత్తంగా ఈ సినిమా డీసెంట్ ఫిల్మ్ అంటూ మరొకరు స్పందిస్తుంచారు. అంతా ఓకె కానీ.. నాకు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ నచ్చలేదు, సెకండాఫ్‌లో కొన్ని సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. తమన్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో వర్కౌట్ అయ్యింది. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ బావుంది అంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ స్మార్ట్‌గా ఉంది. బొమ్మ హిట్టు అంటూ ఇంకొన్ని ట్వీట్లు కనిపిస్తున్నాయి.
తమన్ బీజీఎం బాగాలేదు. సినిమాను బీజీఎం పరంగా పడుకో బెట్టాడు, ఎమోషనల్ గా కనెక్ట్ అయినా ఈ మూవీలో కామెడీ వర్కవుట్ కాలేదు. కొన్ని సీన్లు చాలా ల్యాగ్ ఉన్నాయి అవే ఈ సినిమాకి మైనస్, ఇప్పటి వరకు మీరు చూడని బాలయ్యను, కొత్తగా బాలకృష్ణను చూస్తారు. భగవంత్ కేసరి కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది.. అనిల్ కి మరో హిట్టు పడిపోయింది అంటూ ఓవర్సీస్ ఆడియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.