బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో కెప్టెన్ అవ్వడానికి హౌస్ మేట్స్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే హౌస్ లో పల్లవి ప్రశాంత్ అలాగే ప్రిన్స్ యావర్ లు కెప్టెన్ లు అయ్యారు. ఇప్పుడు మూడో కెప్టెన్ ఎవరు అవ్వాలో అన్న విషయంలో హౌస్ లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. దాని కోసం పెట్టిన టాస్క్ లో ఎవరికి వారే బాగానే ఆడారు. ఇప్పుడు ఫైనల్ గా ఎవరు కెప్టెన్ అవ్వాలో అన్న విషయంలో ఫొటోలకి సంకెళ్లు వేసి వాటిలో నీళ్లలో వదిలితే వారి ఫోటో మునిగిపోకుండా ఉంటుందో వారే కెప్టెన్ అన్నాడు బిగ్ బాస్.
నిన్నటి ప్రోమోలో అమరదీప్ శివాజీ ఫోటో నీళ్లలో వెయ్యగానే నేను నీకు ఇష్టం లేదు.. అందుకే ఇలా అంటూ బిగ్ బాస్ హౌస్ లో హ్యుమానిటీ లేదు గేట్స్ తియ్యండి బయటికెళ్ళిపోతా అంటూ ఫైర్ అయ్యాడు శివాజీ. ఇక ఈ రోజు ప్రోమోలో శోభా శెట్టి అశ్విని ఫోటో నీళ్ళలో వేసింది. నేను కెప్టెన్ అవ్వకూడదని నువ్వు అనుకున్నావా అంది అశ్విని.. నీలో ఆ కెప్టెన్సీ పవర్ కనిపించడం లేదు అంది . ఆ తర్వాత పూజ పల్లవి ప్రశాంత్ ని నువ్వు ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యావ్ అందుకే అనగానే.. ఒక్కసారి అయితే మరొకసారి అవ్వకూడదు అంటున్నావ్ అన్నాడు.
ఇక ప్రిన్స్ యావర్ ప్రియాంక ని నువ్వు అమర్ తో కలిసి ఆడుతున్నావ్ అన్నాడు. లేదు నేను సోలోగానే వచ్చాను, సోలోగానే ఆడుతున్నాను అంటూ యావర్ తో గొడవపడింది. అంతేకాదు.. తన ఫోటో యావర్ నీళ్లలో వేసాడు అని బాగా ఫీలైంది.. ప్రస్తుతం ఈ కెప్టెన్సీ టాస్క్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.