సోషల్ మీడియాలో ప్రస్తుతం #DasaraWinnerKesari హాష్ టాగ్ దర్శనమిస్తుంది. ఈ దసరా సందర్భంగా విడుదలైన మూడు భారీ బడ్జెట్ సినిమాలో ప్రేక్షకులు మెచ్చింది భగవంత్ కేసరినే. బాలకృష్ణ భగవంత్ కేసరితో, తమిళం నుంచి విజయ్ లియో తో నిన్న అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో భగవంత్ కేసరికి మిక్స్డ్ టాక్ రాగా.. లియో కి తెలుగులో డిసాస్టర్ టాక్ వచ్చింది. విడుదలకు ముందు బుకింగ్స్ లో లియో హవా చూపించినా విడుదల తర్వాత సాయంత్రానికి భగవంత్ కేసరి మొత్తం మార్చేసింది.
బాలకృష్ణ పెరఫార్మెన్స్ సూపర్, శ్రీలీల నటన అద్భుతమే కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాదు. అయినప్పటికీ నందమూరి అభిమానులకి భగవంత్ కేసరి బాగా నచ్చేసింది. సాధారణ ఆడియన్స్ మాత్రం యావరేజ్ గా తేల్చేసారు. ఇక లియో పై విడుదలకు ముందున్న అంచనాలు విడుదల తర్వాత తేలిపోయాయి. లియో కోచ్చిన నెగెటివ్ టాక్ చూస్తే సినిమా ఇక ఆడదని ఫిక్స్ అవుతున్నారు. ఏ మాత్రం యావరేజ్ పడినా లియో హిట్ అయ్యి కూర్చునేది. జైలర్ మాదిరి కోట్లు కొల్లగొట్టుకుపోయేది.
ఇక ఈరోజు అక్టోబర్ 20 న విడుదలైన టైగర్ నాగేశ్వరావు పై ప్యాన్ ఇండియా మార్క్ ట్లో మంచి అంచనాలున్నాయి. సినిమాపై క్రేజ్ రావడానికి ప్రమోషన్స్ తో పాటుగా మెయిన్ గా టైగర్ ట్రైలర్ ముఖ్య కారణం. టైగర్ నాగేశ్వరావు ట్రైలర్ విడుదలయ్యింది మొదలు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది అనే ధీమా మేకర్స్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ కనిపించింది. మరి ఈ రోజు విడుదలై టైగర్ నాగేశ్వరావు కి మిక్స్డ్ టాక్ కూడా రాలేదు. ప్రేక్షకులు, క్రిటిక్స్ మొత్తం టైగర్ ని ప్లాప్ గానే తేల్చేసారు.
సూపర్ హిట్ అవ్వకపోయినా భగవంత్ కేసరి ఫామిలీస్ కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడంతో ఈ చిత్రం దసరా విన్నరయ్యింది అంటూ ప్రేక్షకులు తెల్చేయ్యగా.. నందమూరి అభిమానులు మాత్రం #DasaraWinnerKesari హాష్ టాగ్ తో పూనకాలు తేసచ్చేసుకుని ట్విట్టర్ లో రచ్చ మొదలు పెట్టారు.