బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎలిమేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. హౌస్ నుంచి మరో అమ్మాయి బయటికి వచ్చేసింది. ఆదివారం జరిగిన ఎలిమేషన్స్ ఎపిసోడ్ ఆసక్తికరంగా నడిచింది. హౌస్‌లో దసరా సంబరాలను బిగ్ బాస్ ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా హీరోయిన్ డింపుల్ హయాతి తన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో బిగ్‌బాస్ వేదికపై మంటలు రాజేసింది. భారత్, న్యూజిలాండ్‌ల మధ్య క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉండటంతో చాలా మంది ఈ డ్యాన్స్‌ని మిస్ అయి ఉంటారు కానీ డింపుల్ నిజంగా స్టేజ్‌ని తగలెట్టేసింది. దసరా సంబరాలను హౌస్‌లో కూడా ధూంధాంగా నిర్వహించారు.
అనంతరం జరిగిన ఎలిమేషన్స్‌లో ఒకరిని బయటికి పంపిన బిగ్‌బాస్.. ఈ వారం అందరికీ బ్యూటీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఒక ప్రాణం తీశా.. ఇంకొక ప్రాణం పోశా అన్నట్లుగా ఒక లేడీని బయటికి పంపిన బిగ్‌బాస్.. మరో హాట్ బ్యూటీని హౌస్‌లోకి పంపబోతున్నారు. ఆ హాట్ బ్యూటీ ఎవరనేది లాస్ట్‌లో చెప్పుకుందాంలే గానీ.. ఇప్పుడు ఎలిమేషన్ సంగతి చూద్దాం. నామినేషన్స్‌లో ఉన్నవారంతా ఒక్కొక్కరుగా సేఫ్ అవుతూ.. చివరికి పూజ, భోలే ఉండిపోయారు. వారిద్దరిలో ఎవరు వెళ్లిపోతారో.. అనే ఆసక్తి టీవీ చూస్తున్న అందరిలో కలిగించిన బిగ్‌బాస్ చివరికి పూజాని ఎలిమినేట్ చేశారు.
పూజా, భోలే ముందు ఒక బాక్స్ ఉంచి ఇద్దరిని అందులో చేతులు పెట్టమన్నారు కింగ్ నాగార్జున. వారు ఆ బాక్స్‌లో నుంచి చేతులు బయటికి తీసినప్పుడు ఎవరి చేతికి రెడ్ కలర్ అంటుకుంటుందో వారు ఎలిమినేట్ అయినట్లు, గ్రీన్ వస్తే సేఫ్ అని చెప్పగా.. భోలేకి గ్రీన్, పూజాకి రెడ్ కలర్ వచ్చాయి. పూజాని స్టేజ్‌మీదకు పిలిపించి కాసేపు ముచ్చటించిన నాగ్.. హౌస్‌లోని వారిపై తన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫస్ట్ బంచ్‌లో లోనికి వెళ్లిన హాట్ బ్యూటీ రతికా రోజ్‌ని మళ్లీ హౌస్‌లోకి పంపిస్తున్నట్లుగా నాగ్ ప్రకటించారు. ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఆమెకు వచ్చినట్లుగా కింగ్ నాగార్జున తెలిపారు. అయితే ఇంకా ఆమె హౌస్‌లోకి వెళ్లలేదు. ఎప్పుడనేది బిగ్ బాస్ డిసైడ్ చేయాల్సి ఉంది.