బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటివరకు ఎలా ఉన్నా ఇప్పుడు రసవత్తరంగా మారింది. హౌస్ లోకి ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రావడంతో కంటెస్టెంట్స్ లో ఫైర్ పెరిగింది. అశ్విని, భోలే, అంబటి అర్జున్, నయని పావని, పూజలు ఎంట్రీ ఇవ్వగా రెండు వారాలుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని, పూజ వరసగా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ హీట్ మాములుగా లేదు. ఎవ్వరూ తగ్గడం లేదు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా హౌస్ మేట్స్ బిహేవియర్ ఉంది.
శివాజీపై అమరదీప్, అమరదీప్ పై శివాజీ ఫైర్ ఆయ్యారు. గౌతమ్ నామినేషన్ విషయంలో పల్లవి ప్రశాంత్ మరోసారి తన పైత్యం చూపించాడు. ఇక శివాజీకి గత వారం శోభా శెట్టి-ప్రియాంకలు భోలే తో గొడవ పడిన విషయంలో నామినేట్ చేసాడు. దానితో శివాజీ ని నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు జెంటిల్మన్ గా ఉన్న శివాజీ అమ్మాయిలని నామినేట్ చెయ్యడమే కాకుండా భోలే ని సపోర్ట్ చేస్తున్నాడంటూ #ShobhaShetty పై సింపతీ వ్యక్తం చేస్తున్నారు.
మరికొంతమంది శోభా శెట్టి హౌస్ లో ఉండకూడదు, ఆమె ఓ వరెస్ట్ కంటెస్టెంట్ అంటూ ఆమెని కామెంట్ చేస్తున్నారు. అమరదీప్ భోలేని రెండు వారాలుగా మీ ఆట కనిపించడం లేదు అంటూ నామినేట్ చెయ్యగానే.. నువ్వు మొదటి నాలుగు వారాల్లో ఏమాడవంటూ అమరదీప్ ని భోలే రెచ్చగొట్టాడు. ఇక అశ్విని పై శోభా శెట్టి ఫైర్ అయ్యిది. తేజకి అశ్విని మధ్యన గొడవైంది. ఈ వారం అగ్గిలో ఫోటో వేసి నామినేట్ చెయ్యడమేమో కానీ.. హౌస్ లో మాత్రం అగ్గి రాజుకుంది.