Advertisementt

Mega156 టైటిల్ అదేనా..

Wed 25th Oct 2023 07:04 PM
chiranjeevi,vasishta  Mega156 టైటిల్ అదేనా..
Speculations on Mega 156 title Mega156 టైటిల్ అదేనా..
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తర్వాత బింబిసార డైరెక్టర్ వసిష్ఠతో మెగా 156 మొదలు పెట్టారు. నిన్న దసరా సందర్భంగా మెగా 156 మ్యూజిక్ సిట్టింగ్స్ తో సినిమాకి పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ అంటే 200 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం పంచభూతాలు నేపథ్యంలో ఉండబోతున్నట్టుగా మెగా 156 దసరా పోస్టర్ లో కనిపించింది.

అయితే ఈ చిత్రానికి ముందుగా ముల్లోకాల వీరుడు అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ సరిపోతుంది అని, అలాగే ఈ టైటిల్ పవర్ ఫుల్ గాను ఉంటుంది అని ఈ టైటిల్ కే వసిష్ఠ-మెగాస్టార్ మొగ్గు చూపుతున్నారంటూ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి.. అన్ని భాషల్లో ఇదే టైటిల్ బావుంటుంది అని తెలుస్తుంది. 

ఈ చిత్రంలో మెగాస్టార్ తో తలపడేందుకు రానాని విలన్ గా అనుకుంటున్నట్లుగా, అనుష్క, నయనతార ల పేర్లు హీరోయిన్స్ లో లిస్ట్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. నవంబర్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు వసిష్ఠ ప్లాన్ చేస్తున్నారు. 

Speculations on Mega 156 title:

Speculations on Chiranjeevi-Vasishta Mega 156 title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ