గత గురువారం దసరా ఫెస్టివల్ ని క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ అయిన నందమూరి నటసింహ బాలకృష్ణ భగవంత్ కేసరి కి ఈ వారం కూడా కలిసొచ్చింది. ఈ దసరాకు మూడు బిగ్ బడ్జెట్ మూవీస్ విడుదల కాగా.. అందులో లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరావులు ఉన్నాయి.ఈ మూడు చిత్రాల్లో లియో డబ్బింగ్ మూవీని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు, అలాగే రవితేజ టైగర్ నాగేశ్వరావు ని లైట్ తీసుకున్నారు. దానితో బాలయ్య భగవంత్ కేసరికి కలిసొచ్చింది.
భగవంత్ కేసరి సినిమాకి అద్భుతమైన టాక్ రాకపోయినా కుటుంబ ప్రేక్షకులు మెచ్చడంతో.. భగవంత్ కేసరి బెస్ట్ ఫిగర్స్ ని నమోదు చేసుకుంటూ 100 కోట్ల గ్రాస్ లోకి ఎంటర్ అయ్యింది. అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ కథ ఇవ్వకపోయినా.. తండ్రి-కూతురు అనుబంధం ప్రేక్షకులకి నచ్చడంతో సినిమా థియేటర్స్ లో పరుగులు పెడుతుంది. ఇక ఎనిమిది రోజులుగా భగవంత్ కేసరికి ఎదురు లేకుండా పోయింది.
ఇక ఈ వారం కూడా చిన్న సినిమాలు థియేటర్స్ లో విడుదల కావడం, అందులో ఏ చిత్రమూ ప్రేక్షకులకి నచ్చకపోవడంతో ఈ వారము భగవంత్ కేసరికి ఎదురులేకుండా పోయింది. అంటే మరో వారం బాలకృష్ణ భగవంత్ కేసరి దున్నేయ్యడం ఖాయం. ఈ సెకండ్ వీకెండ్ కూడా భగవంత్ కి భారీ కలెక్షన్స్ రావడం పక్కా.