Advertisementt

విజయమ్మ Vs భువనేశ్వరి..

Mon 30th Oct 2023 09:30 AM
vijayamma vs bhuvaneshwari  విజయమ్మ Vs భువనేశ్వరి..
Vijayamma vs Bhuvaneswari విజయమ్మ Vs భువనేశ్వరి..
Advertisement
Ads by CJ

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎట్టకేలకు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమె తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబు కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా కూడా ఆమె ఏనాడు కన్నెత్తి చూడలేదు. అలాంటి నారా భువనేశ్వరిని భర్తను అన్యాయంగా జైలుకు పంపడం కలిచివేసింది. నిజం కావాలంటూ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు. అయితే ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టింది మొదలు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెదంతా సొంత డబ్బా అని.. ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉన్నారు. జనం గురించి ఏమాత్రం భువనేశ్వరమ్మ ఆలోచించడం లేదు. అలాంటప్పుడు ఆమె ప్రసంగాలను ఎవరు వింటారంటూ ప్రచారం మొదలు పెట్టారు.

ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ, భువనేశ్వరమ్మల మధ్య తేడాలంటనే విషయాన్ని టీడీపీ నేతలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బాధలో ఉన్నారు కాబట్టి తన బాధను భువనేశ్వరి చెప్పుకుంటున్నారు. మరి కొన్నేళ్లుగా జనంలో తిరుగుతున్న విజయమ్మ చేసిందేంటని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. విజయమ్మ ఏనాడూ తనకు ఓటు వెయ్యాలనో లేదంటే తన కొడుకుకు ఓటు వేయాలనో.. ఇక ప్రస్తుతం తన కూతురికి ఆమె పార్టీకి ఓటు వేసి గెలిపించి కూతురిని సీఎంని చేయాలని అడుగుతున్నారు తప్ప ఏనాడూ ప్రజల గురించి ఆమె ఆలోచించింది లేదు. కానీ భువనేశ్వరి తన తండ్రి మరణానంతమే 26 ఏళ్ల క్రితమే ‘ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్’ను ఏర్పాటు చేసి దాని ద్వారా సేవలందిస్తున్నారని చెబుతున్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి ఏమేం చేశారంటే..

1. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ను స్థాపించి అందులో వేలమంది అనాధ పిల్లలను ఉచితంగా చదిస్తున్నారు.. 

2. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా స్కాలర్ షిప్స్ అందిస్తూ 4,193 మంది పేద విద్యార్థులను 3.44కోట్ల ఆర్థిక సాయం అందించారు..

3. బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రతి ఏటా 50మంది ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఇప్పటివరకు 1.93కోట్లు స్కాలర్ షిప్ రూపంలో అందించారు..

4. NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1,617మంది విద్యార్థులను కాలేజీలలో చదివిస్తున్నారు..

5. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్థాపించి 7,345 యువతీ యువకులకు శిక్షణ ఇప్పించి వారిలో 2,500 మందికి ఉద్యోగాలు ఇప్పించారు..

6. జాబ్ మేళాలు నిర్వహించి మరో 4,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు..

7. గత 26సంవత్సరాలలో 11,372 ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 19,07,443 మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు..

8. రక్త నిధి కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 83,582 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందులో 20,045 యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధి బాధితులకు 55,048 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర సేవల నిమిత్తం అందించారు..

9. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 క్లస్టర్ మోడల్ ఆర్వో ప్లాంట్లను, 42ఇండివిడ్యువల్ ప్లాంట్లను నెలకొల్పి తాగు నీరు అందిస్తున్నారు..

10. NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రకృత్తి విపత్తులు సంభవించిన సమయాల్లో ఇప్పటివరకు 20లక్షల మందికి సాయం అందించారు.. 

11. 2013లో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు 500మంది తెలుగు వారిని ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి చేర్చారు.. 

12. 2014లో హుదుడ్ తుఫాన్ వచ్చినప్పుడు 50,000మంది బాధితులకు మందులు, ఆహారం, మజ్జిగ, పాలు, త్రాగునీరు అందించారు..

13. 2016లో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు 10బస్తీలలోని 5,000మంది పేదలకు సాయం అందించారు.. 

14. 2009లో కర్నూల్, మహబూబ్ నగర్ లో వరదలు వచ్చినప్పుడు 54వైద్య బృందాల ద్వారా శిబిరాలు నిర్వహించి 15కోట్ల విలువైన మందులు, వస్త్రాలు, దుప్పట్లను వరద బాధితులకు పంపిణీ చేశారు..

15. 2021లో చిత్తూరు నెల్లూరులలో భారీ వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినప్పుడు 50వేల మందికి పైగా వరద బాధితులకు ఆహారం, పాలు, త్రాగు నీరు, దుప్పట్లు, నిత్యావసర సరకులు అందించారు.. అంతేకాకుండా వరదల్లో మరణించిన 48మంది కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున 48లక్షలు సాయం చేశారు..

16. కరోనా సమయంలో 1,500 మంది కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించారు.. 2లక్షల మాస్కులు అందించారు.. 29లక్షల విలువైన మందులు పంపిణీ చేశారు.. 1.35కోట్లతో ఏపీ, తెలంగాణలో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు..

17. ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా అధిక బరువు, కొలెస్టరాల్, డయాబెటీస్, రక్తపోటు నియంత్రణకై న్యూట్రిపుల్ యాప్ ద్వారా న్యూట్రిషనిస్టుల ద్వారా డైట్ ప్లాన్లను, ఆరోగ్య సలహాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది..

18. పేద మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ సంజీవని పేరుతో ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది.

మరి ఇంత సేవ చేసిన భువనేశ్వరిని జనం కోసం ఏమీ ఆలోచించడం లేదని ఎలా అంటారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. రాజకీయాల్లో ఉంటేనే సేవ చేసినట్టా? అని నిలదీస్తున్నారు. జనానికి ఇంత చేసిన భువనేశ్వరికి అదే జనానికి తన బాధ చెప్పుకోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు

Vijayamma vs Bhuvaneswari :

Vijayamma Vs Bhuvaneshwari.. There is a big difference!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ