Advertisementt

బిగ్ బాస్ ఓ చెత్త షో

Wed 01st Nov 2023 11:50 AM
bhanu sri mehra  బిగ్ బాస్ ఓ చెత్త షో
Bhanu Sri Mehra shocking comments on Bigg Boss బిగ్ బాస్ ఓ చెత్త షో
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కి బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఎంత ఆదరణ ఉందో.. కొంతమందికి అంతే చెడు అభిప్రాయం ఉంది. చాలామంది బిగ్ బాస్ కి వ్యతిరేఖంగా మాట్లాడడం కాదు, కోర్టులో కేసు వేసిన సందర్భమూ ఉంది. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లి తమని తాము నిరూపించుకుని వెండితెర మీద, బుల్లితెర మీద ఫేమస్ అవుతామని కలలు కనే వాళ్ళు ధైర్యంగా బిగ్ బాస్ కి వెళుతున్నారు. అందులో కెరీర్ లో వెనకబడిన హీరోయిన్స్, హీరోస్, నటులు ఇలా చాలామందే ఉన్నారు.

అయితే ఇప్పుడో  హీరోయిన్ బిగ్ బాస్ అనేది ఓ చేత షో అంటూ స్టేట్మెంట్ పాస్ చేసింది. అల్లు అర్జున్ సరసన వరుడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కెరీర్ లో ఒడిదుకులతో ముందుకు వెళ్లినా.. సక్సెస్ అవ్వక ప్రస్తుతం సైలెంట్ గా అంటున్న భానుశ్రీ మెహ్రా బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె బిగ్ బాస్ షో ఓ చెత్త షో.. అసలు ఇలాంటి వాటిని ప్రేక్షకులు ఎలా చూస్తున్నారో.. ప్రతిసారి కొత్త సీజన్స్ ఎలా వస్తున్నాయో అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను.

నా అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ అనేది ఓ చెత్త షో. నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో ఈ షో నుంచి అలాంటి భయంకరమైన హైలైట్స్ తో నిండిపోయింది అంటూ భానుశ్రీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే భానుశ్రీ అల్లు అర్జున్ తనని సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. 

Bhanu Sri Mehra shocking comments on Bigg Boss:

Bigg Boss is a worst show: Bhanu Sri Mehra

Tags:   BHANU SRI MEHRA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ