బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ హీటెక్కిస్తోంది. గత రెండు రోజులుగా తొమ్మిదో వారం నామినేషన్స్ హీట్ ఇంకా హౌస్ ని వదలకుండానే కెప్టెన్సీ టాస్క్ మొదలైపోయింది. మరి నామినేషన్స్ లో ఉన్నవారు ఆట బాగా ఆడితేనే ఇంట్లో ఉంటామనే ఉద్దేశ్యంతో కసిగా ఆట కోసం బరిలోకి దిగారు. రెండు టీమ్స్ గా విడగొట్టి రెడ్ అండ్ ఎల్లో బెలూన్స్ ఊది టైర్స్ లో పెట్టాలి. అందులో భాగంగా యావర్ కి అర్జున్ కి మధ్యన గొడవ జరిగింది. ఆ తర్వాత ప్రియాంక కూడా యావర్ పై కి దూసుకెళ్లింది.
అయితే గెలిచినవాళ్ళు ఓడినవాళ్ల గ్రూప్ నుంచి ఒకరిని టాస్క్ నుంచి తీసేస్తే.. వాళ్ళు మెడలో డెడ్ బోర్డు వేసుకోవాలని బిగ్ బాస్ చెప్పగా.. శోభా శెట్టి-గౌతమ్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు అందరూ డిస్కర్స్ చేసుకున్నారు. స్ట్రాంగ్ వాళ్లతో ఆడితేనే కదా మజా ఉంటుంది అని శోభా శెట్టి అన్నది. ఆ తర్వాత గ్రూప్ మొత్తం కలిసి పల్లవి ప్రశాంత్ ని ఈ టాస్క్ నుంచి తీసేసారు. దమ్ముంటే నన్ను తీయ్యాలిరా వాడిని కాదురా అని శివాజీ మాట్లాడాడు. అది టీమ్ డెసిషన్ ఇదేమి పర్సనల్ కాదు అన్నాడు గౌతమ్. తర్వాత ప్రశాంత్ ఏడుస్తుంటే అర్జున్ వచ్చి నీకు పాపులారిటీ వస్తుందిరా అన్నాడు. అనుకున్నది చెయ్యడం కూడా తప్పేనా అంటూ గౌతమ్ అన్నాడు. అయినా గేమ్ ఓడిపోతే ఏడవడం ఏమిట్రా బాబు అన్నాడు శివాజి. ఫైనల్ గా ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ కి డెడ్ బోర్డు వేశారు. దానితో శివాజీ దీనిని చూసి ఇంకా కసి పెంచుకోమంటూ రైతు బిడ్డకి సలహా ఇచ్చాడు.