Advertisementt

రానా బ్రదర్ అభిరామ్ పెళ్లి డేట్ వచ్చేసింది

Fri 03rd Nov 2023 01:55 PM
daggubati abhiram  రానా బ్రదర్ అభిరామ్ పెళ్లి డేట్ వచ్చేసింది
Rana brother Abhiram wedding date has arrived రానా బ్రదర్ అభిరామ్ పెళ్లి డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి ముహూర్తం సెట్టయ్యింది. దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి భజాలుకు సర్వం సిద్ధమైంది. రీసెంట్ గానే అభిరామ్ తన పెళ్లి పెద్దలు కుదిర్చిన అమ్మయితోనే, వారి ఇష్టప్రకారమే జరగబోతున్నట్టుగా చెప్పాడు. సురేష్ బాబు తన చిన్న కొడుకు అభిరామ్ పెళ్లిని ఆయన చిన్నాన్న కూతురు కూతురుతో అంటే మేనకోడలితోనే చెయ్యబోతున్నారు. ఎప్పుడో అనుకున్న సంబంధం కావడం, ఇప్పుడు అన్నీ అనుకూలంగా మారడంతో అభిరామ్ పెళ్లి పీటలెక్కనందుకు రెడీ అయ్యాడు.

తాజాగా అభిరామ్ పెళ్లి తేదీ వచ్చేసింది. డిసెంబర్ 6 న దగ్గుబాటి అభిరామ్ పెళ్లి ఆయన మరదలితోనే జరగబోతుంది. అయితే అభిరామ్ వివాహం హైదరాబాద్ లో జరుగుతుందా.. లేదంటే ఈమధ్యన సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగా డెస్టినేషన్ వెడ్డింగ్ గా శ్రీలంక లో జరగబోతుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. పెళ్లి డిసెంబర్ 6 న మాత్రం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకు అనుకూలంగా దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలిపోయినట్లుగా టాక్.

రీసెంట్ గానే వెంకటేష్ చిన్న కుమార్తె హవ్యవాహిని నిశ్సితార్ధం విజయవాడకి చెందిన డాక్టర్స్ ఫ్యామిలీ కుర్రాడితో జరిగిపోయింది. ఇక వెంకీ కుమార్తె పెళ్లి కూడా అతి త్వరలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈలోపు అభిరామ్ పెళ్లి తేదీ బయటికి వచ్చేసింది. అంటే దగ్గుబాటి వారి ఇంట బ్యాక్ టు బ్యాక్ పెళ్లి భాజాలు మోగబోతున్నాయన్నమాట.

Rana brother Abhiram wedding date has arrived:

Daggubati Abhiram wedding date locked

Tags:   DAGGUBATI ABHIRAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ