మెగాస్టార్ చిరు చిన్న కుమర్తె ప్రస్తుతం తన పిల్లలతో సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తో పెళ్లి, విడాకులు, ఆ తర్వాత చిరు స్నేహతుడు కుమారుడు కళ్యాణ్ దేవ్ తో రెండో వివాహం.. అది కూడా బ్రేకప్ అవడంతో శ్రీజ ప్రస్తుతం తల్లితండ్రులతో కలిసి ఉంటుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ వివాహం కోసం ఫ్యామిలితో కలిసి ఇటలీకి వెళ్లొచ్చిన శ్రీజ అక్కడ తన పిల్లలు, అక్క చెల్లెళ్ళు, అన్నలతో బాగా ఎంజాయ్ చేసింది. ఇటలీ నుంచి తిరిగొచ్చిన శ్రీజ తన సోషల్ మీడియా పేజీ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఏ విషయాలైన నా నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, హృదయం గాయపడడమే కాదు, విరిగిపోతుంది. మనసంతా కలతతో క్షీణించిపోతుంది. ఆ సమయంలో శరీరమూ అలిసిపోతుంది, బలహీనం అవుతుంది. లైఫ్ లో కష్టలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా, నష్టాలూ వచ్చినా, మనసులో భాధగా ఉన్నా, గుండె పగిలినా, పరిస్థితి చేజారినా ఒక్కసారి కళ్ళు మూసుకుని మనసు లోతుల్లోకి వెళితే అంతా దానంతటఅదే సెట్ అవుతుంది. కష్టాల సమయంలో మన ముందున్న ఏకైక దారి కూడా అదే అంటూ శ్రీజ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.