Advertisementt

ట్రెండింగ్‌లో RC16.. హీరోయిన్ ఫిక్సా?

Fri 17th Nov 2023 07:00 PM
rc16 sai pallavi  ట్రెండింగ్‌లో RC16.. హీరోయిన్ ఫిక్సా?
Sai Pallavi Name for RC16 ట్రెండింగ్‌లో RC16.. హీరోయిన్ ఫిక్సా?
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ చేంజర్ మూవీ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేస్తూనే ఉంది. కారణం ఈ సినిమాకు సంబంధించి సరైన అప్‌డేట్ లేకపోవడం, విడుదల ఎప్పుడో చెప్పకపోవడం, విడుదలకు రెడీ అని చెప్పిన జరగండి సాంగ్‌ని వాయిదా వేయడం.. ఇలా ప్రతి విషయం మెగా ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తూ వస్తుంది. సరే ఆ సినిమా సంగతి అటుంచితే.. గేమ్ చేంజర్ తర్వాత చరణ్ చేయబోయే సినిమాకు సంబంధించి మాత్రం వార్తలు వైరల్ అవుతున్నాయి.

బుచ్చిబాబు సానా, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న RC16 సినిమాకు సంబంధించి చిన్న విషయం కూడా భారీ స్థాయిలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. RC16 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరో వైపు క్యాస్ట్ అండ్ క్రూ ని సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యారు. అలాగే విలన్‌గా ఉప్పెన నటుడు, విలక్షణ నటుడైన విజయ్ సేతుపతి కూడా దాదాపు కన్ఫర్మ్ అనేలా వార్తలు వినబడుతున్నాయి. ఇక హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికే ఓ నలుగురైదుగురు పేర్లు వినిపించాయి. 

ఈ పాన్ ఇండియా సినిమాతో మొదట రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ తెలుగులోకి అరంగేట్రం చేస్తుందనేలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఇప్పుడు డ్యాన్సింగ్ బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జతకట్టబోతుందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. స్ర్కిప్ట్ కూడా ఆమె వద్దకు వెళ్లిందని, ఇక ఆమె ఓకే చెప్పడమే తరువాయి.. హీరోయిన్ పేరు అధికారికంగా యూనిట్ ప్రకటించడానికి సిద్ధంగా ఉందనేలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే చిత్రయూనిట్ సైడ్ నుంచి మాత్రం ఈ విషయంలో ఎటువంటి అధికారిక అప్‌డేట్ ఇప్పటి వరకు రాలేదు. బుచ్చిబాబు ఈ సినిమాని గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నారు.

Sai Pallavi Name for RC16:

RC16 Trending with Sai Pallavi Name 

Tags:   RC16 SAI PALLAVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ