సింగర్ సునీత పాపులర్ సింగర్ గానే కాదు.. ఆమె లైఫ్ లో ఎన్నో కాంట్రవర్సీలు, వ్యక్తిగతంగానూ చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత భర్తకి విడాకులిచ్చి, పిల్లతో సింగిల్ మథర్ గా మారి.. కొన్నేళ్లు ఆ లైఫ్ లో సతమతమైన సునీత మ్యాంగో రామ్ ని రెండో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ ఆమె జీవితంలో జరిగిన సంచలనాలు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీత తన పర్సనల్ లైఫ్ లోనే కాదు.. కేరీర్లోనూ ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా కామెంట్స్ చేసారు.. నీ వాయిస్ హస్కీగా ఉంటుంది.. మాట, పాట గొంతులోనే ఆగిపోతుంది అంటూ కామెంట్స్ చేసేవారు.
నా ఫ్యామిలీ కోసం చిన్నవయసులోనే కెరీర్ స్టార్ట్ చేశాను, అదే తెలియని వయసులో పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టారు, పిల్ల పుట్టడం హ్యాపీనే అయినా.. భర్త విషయంలో బాధపడ్డాను, నా పక్కన ఉన్నవాళ్లే అప్పుడు ఇలా చెయ్యకుండా ఉంటే బాగుండేది అనేవారు, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎప్పుడూ తపన పడేదాన్ని, 35 ఏళ్ళు వచ్చేవరకు కష్టపడ్డాను, నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేసారు. మోసపోయిన ప్రతిసారి షాకయ్యను. నా నవ్వు ఫేక్ అంటూ మట్లాడేవారు.
పర్సనల్ లైఫ్ లోనే కాదు, కెరీర్ లోనూ చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, కెరీర్ లో కొన్ని కారణాల వలన మంచి అవకాశాలు వదులుకున్నాను, నా జీవితంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు, కానీ ఎన్నో మాటలనేవారు, కొన్నిసార్లు ఆ కామెంట్స్ చూసి బాధపడేదాన్ని. నా జీవితంలో నేను ఏదైనా మంచి పని చేశాను అంటే అది రెండో పెళ్లి చేసుకోవడమే, రామ్ ని వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నాను అంటూ సునీత ఆ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యింది.