Advertisementt

బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్

Sun 19th Nov 2023 06:34 PM
bigg boss 7  బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్
Big twist in Bigg boss బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. సీజన్ 7 ఉల్టా పూల్టా అంటూ నాగార్జున మొదటి నుంచి చెప్పినట్టుగానే హౌస్ లో చాలాసార్లు ఉల్టా పుల్టా కనిపిస్తుంది. నెల తర్వాత ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ, మూడు నాలుగు వారాల తర్వాత రతిక రీ ఎంట్రీ, గౌతమ్ సీక్రెట్ రూమ్, టాస్క్ ల్లో ఉల్టా పుల్టా ఇలా చాలా జరిగాయి, ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిదిమందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది కాస్త ఆసక్తిగానే మారింది. శోభా శెట్టి, రతిక మొదటినుంచి అంటే 11 వారం మొదలైనప్పటినుంచి డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మొదటి రెండు స్థానాల్లో ఒకసారి అమర్, ఒకసారి యావర్ ఉన్నప్పటికీ.. ఫైనల్ గా వారం ముగిసే సరికి అమర్ దీప్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. శోభా, రతిక లు చివరి ప్లేస్ లో ఉన్నారు.

అయితే శోభా శెట్టి, రతిక డేంజర్ జోన్ లో ఉండగా.. యావర్ తన ఏవిక్షన్ ప్రీ పాస్ తో రతికని కాపాడతాడు, శోభ శెట్టి ఎలిమినేషన్ తప్పదు. ఆహా కాదు శోభా, రతిక డబుల్ ఎలిమినేషన్ అంటూ వార్తలొచ్చాయి. కానీ ఈ వారం బిగ్ బాస్ ఉల్టా పుల్టా లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనుకుని ఆతృతగా ఉన్న ప్రేక్షకులకి షాకిచ్చారు.

అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేదు, శోభ శెట్టి ఎలిమినేట్ అవలేదు, అసలు 11 వ వారం ఎలిమినేషన్ లేకుండా ఎత్తేసారు. అంటే ఇది పెద్ద ట్విస్ట్ అంటుంటే.. ఉల్టా పుల్టాలో భాగమే ఈ వారం ఎలిమినేషన్ లేదు అంటున్నారు. మరికొంతమంది అమ్మాయిలని కాపాడడానికే ఈవారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎత్తేసారు అంటూ మాట్లాడుకుంటున్నారు.

Big twist in Bigg boss:

No Elimination in this week in Bigg Boss

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ