డీఎంకే అధినేత విజయకాంత్‌కు గత శనివారం తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉండడం, ఛాతీ నొప్పిఆయనని కుటుంభ సభ్యులు చెన్నైలోని నందంబాక్కం ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేసినట్లుగా సమాచారం.
ఆయనకి ప్రస్తుతం అక్కడే చికిత్స కొనసాగుతోంది. విజయకాంత్ 3వ రోజు చికిత్స పొందుతుండగా.. ఆయనకు వైద్యులు ఎప్పటికప్పుడు కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు సమాచారం. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలోనూ డయాబెటిస్ ఎక్కువగా ఉండడం వలన విజయ్ కాంత్ మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా విజయ్ కాంత్ వీల్ చైర్ లోనే వెళ్తుంటారు. ఇక ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్టు వైద్యులుచెబుతున్నారు. ప్రస్తుతం విజయ్ కాంత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని తెలుస్తోంది.