Advertisementt

గుంటూరు కారం నుంచి గుడ్ న్యూస్

Tue 21st Nov 2023 10:55 AM
guntur kaaram  గుంటూరు కారం నుంచి గుడ్ న్యూస్
Good news from Guntur Kaaram గుంటూరు కారం నుంచి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

గుంటూరు కారం ప్రమోషన్స్ మొదలు కావడం లేటేమో కానీ.. మొదలయ్యాక ఆగేదెలా అంటున్నారు మేకర్స్. గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ఇవ్వడానికి తెగ ఆలోచించిన వారు ఇప్పుడు మరో సింగిల్ ని వదలడానికి రెడీ అవుతున్నారు. ఎలాంటి హడావిడి లేకుండానే నిర్మాత నాగ వంశీ గుంటూరు కారం సెకండ్ సింగిల్ పై అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు. గుంటూరు కారం తర్వాతి పాట వచ్చేవారమే, ఈ సినిమా నుంచి విడుదలయ్యే పాటలను వచ్చే ఏడాది పొడవునా పాడుకుంటూ ఉంటారంటూ నిర్మాత నాగ వంశి గుంటూరు కారం పాటలపై హైప్ క్రియేట్ చేసాడు.

ఇప్పటికే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ వదలగా.. ఆ ధూమ్ మసాలా సాంగ్ కి మూవీ లవర్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండో పాట మహేష్-శ్రీలీలపై డ్యూయెట్ గా ఉండబోతుంది అంటున్నారు. మరి మహేష్-శ్రీలీలని జంటగా చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఈ పాట వదిలితే  కోరిక తీరిపోతుంది. ఈ చిత్రంలో శ్రీలీలతో పాటుగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. 

Good news from Guntur Kaaram:

Guntur Kaaram Second Single Update

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ