ప్రస్తుతం టీడీపీ లో చంద్రబాబు పెద్దగా ఉంటే ఆయన వారసత్వంగా బాబు గారి కొడుకు నారా లోకేష్ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నాడు. అంటే చంద్రబాబు తర్వాత ఆయన కొడుకే సీఎం అవుతాడు అని టీడీపీ కార్యకర్తలు, ఏపీ ప్రజలు కూడా భావిస్తున్నారు. కానీ నందమూరి కుర్రాళ్లలో ఒకరు చంద్రబాబు తర్వాత బాలకృష్ణే సీఎం ఆ తర్వాతే లోకేష్ అంటూ మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. కానీ ఆయన సినిమాలు, రాజకీయాలని హ్యాండిల్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లో లేరు. బావ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అక్క ఫ్యామిలికి ఆయన అండగా ఉన్నారు.
అయితే తాజాగా చంద్రబాబు తర్వాత సీఎం అయ్యేది బాలా బాబాయ్ అంటూ నందమూరి చైతన్య కృష్ణ తన బ్రీత్ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడాడు. బాలకృష్ణ సిఎం అయ్యాకే నారా లోకేష్ సీఎం అవుతాడంటా చైతన్య కృష్ణ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ఇక తన సినిమా బ్రీత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీని మొత్తం పిలుస్తున్నా, ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్ కి అటెంట్ అవుతారని చెప్పాడు.
అంతేకాకుండా ఎన్టీఆర్ కి రెండో భార్యగా వచ్చిన లక్ష్మీ పార్వతి మా కుటుంబంలోకి వచ్చిన శని.. అంటూ చైతన్య కృష్ణ సంచలన కామెంట్స్ చేసాడు. నందమూరి ఫ్యామిలీ లక్ష్మి పార్వతిని అసలు కన్సిడర్ చెయ్యరు. అదే విషయాన్ని చైతన్య తన మాటల్లో చెప్పాడు.