బిగ్ బాస్ సీజన్ 7 లో ఇప్పటివరకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వలేదు. కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం తనకి సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారు తప్ప ప్రోపర్ గా బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వలేదు. కాని ఈ వారం హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అమర్ దీప్, అర్జున్ లను పోలీసులు గెటప్స్ చేసి.. మిగతా హౌస్ మేట్స్ కి మంచి పార్టీ ఇచ్చాడు బిగ్ బాస్. ఆతరవాత ఓ రెస్టారెంట్ లో మర్డర్ కేసుని సాల్వ్ చెయ్యాలని అమర్, అర్జున్ లకి బిగ్ బాస్ చెప్పాడు. ఇక పోలీస్ పాత్రలో అమర్ దీప్ సూపర్ గా ఆకట్టుకుంటున్నాడు, నటనలో ఇరగదీస్తున్నాడు.
అర్జున్, అమర్ లు హౌస్ మేట్స్ ని ఇంటరాగేట్ చేస్తుంటే.. శోభా శెట్టి, అశ్వినీ రిపోర్ట్స్ గా మీడియా పైత్యం చూపిస్తున్నారు. ఈ టాస్క్ లో ప్రతి ఒక్కరూ జీవించేస్తున్నారు. ఎందుకంటే అందరిలో నామినేషన్స్ టెన్షన్ కనిపిస్తుంది. అసలే ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారని నాగ్ చెప్పడంతో అందరిలో ఆ టెన్షన్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ టాస్క్ లో శివాజీని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఒక నెక్ లెస్ చూపిస్తూ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు.
శివాజీకే కాదు పల్లవి ప్రశాంత్ కి కూడా బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్టుగా ఈరోజు వదిలిన ప్రోమోలో చూపించారు. ఈ సీజన్ లో ఇదే మొదటి సీక్రెట్ టాస్క్ గా కనిపిస్తుంది.