బిగ్ బాస్ సీజన్ 7 లో టైటిల్ ఫెవరెట్ అనుకున్న అమర్ దీప్ కొద్దివారాలు హౌస్ లో డల్ అయ్యాడు. మొదటివారంలో అమర్ దీప్ ఆట ఆసక్తికరంగా లేదు. గత మూడు నాలుగు వారాలుగా అమర్ దీప్ టాస్క్ ల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. అయితే అమర్ దీప్ గత రెండు వారాలుగా కెప్టెన్సీ టాస్క్ కోసం టాస్క్ లో పోరాడుతూనే హౌస్ మేట్స్ ని ఏడుస్తూ వేడుకోవడం ఓ వర్గం ఆడియన్స్ కి నచ్చకపోయినా అమర్ దీప్ కష్టానికి అతని గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో అమర్ దీప్ ని హౌస్ మేట్స్ హేళన చేసినట్లుగా కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
X లో అమర్ దీప్ హాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది. అది ఓపెన్ చెయ్యగానే అమర్ తనని సపోర్ట్ చెయ్యమని శివాజీ వర్గాన్ని అడుగుతున్నాడు. అందులో ప్రిన్స్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అర్జున్ ఉండగా.. శివాజీ నువ్వు డిపెండ్ చేసుకోరా నువ్వు నచ్చితే నీకు సపోర్ట్ చేస్తారు అన్నాడు. అక్కడి నుంచి అమర్ వెళ్ళిపోగానే.. అమర్ గాడు ముందు నిన్నే అడిగాడు అంటూ ప్రిన్స్ తో అన్న శివాజీ.. వాడికి నువ్వంటే భయం అందుకే ముందు నిన్ను అడిగాడు అంటూ నవ్వేసాడు. ఆ తర్వాత ప్రిన్స్ కూడా నవ్వాడు. పల్లవి ప్రశాంత్ అయితే అమర్ కే సపోర్ట్ చేసాడు.
కానీ శివాజీ అమర్ ఏడుస్తుంటే రెచ్చగొడుతూ నువ్వు ఏడిస్తే ఏమి రావు, నా భార్య, అమ్మ, నాన్న కెప్టెన్ కోసం అవ్వాలంటే బాగా ఆడు అంతే కానీ ఏడవకు, మా అమ్మ నాన్న కోసం కప్ కావాలి అంటే ఇచ్చేస్తారా అంటూ శివాజీ అమర్ తో వాదన పెట్టుకున్నాడు. శోభ శెట్టి అమర్ కే నా ఓటు అంటే శివాజీ నేను మాటిచ్చాను అర్జున్ వైఫ్ కి అర్జున్ కే నా ఓటు అంటూ చివరికి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఎవరూ కెప్టెన్ కాకుండా ఇద్దరినీ కాల్చేసేలా శివాజీ చేసాడు. నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది అంటూ అమర్ వేడుకోవడంతో అతనికి సింపతీ బాగా క్రియేట్ అయ్యింది.