బిగ్ బాస్ సీజన్ 7 మొదలైన ఓ నెల వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ బుల్లితెర ప్రేక్షకుల్లో కనిపించలేదు. కానీ ఉల్టా పూల్టా అంటూ ఓ ఐదుగురిని హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పించి ఆసక్తిని క్రియేట్ చేసారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి ఆరేడు వారాల్లో వరసగా అమ్మాయిలనే ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్లారు. ఇక చివరి వారాల్లో కుట్రలు, కుతంత్రాలు, సింపతీ గేమ్ ఇలా హౌస్ మేట్స్ మధ్యన రకరకాల కలర్స్ బయట పడుతూ ఆట రంజుగా మారిపోయింది.
గత వారం నో ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చి ఈవారం ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. కాదు ఇప్పటికే చేసేసారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అశ్విని ముందుగా ఎలిమినేట్ అవ్వగా.. తర్వాత కూడా మరో అమ్మాయిని ఎలిమినేట్ చేసినట్టుగా సోషల్ మీడియా లీకులు చెబుతున్నాయి. రెండో ఎలిమినేషన్ లో భాగంగా రతిక-అర్జున్ లు చివరిగా డేంజర్ జోన్ లో ఉండగా.. ప్రశాంత్ తన దగ్గరున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి అర్జున్ ని సేవ్ చేసినట్లుగా తెలుస్తుంది. దానితో రతిక ఎలిమినేట్ అయ్యింది.
ఇంతకుముందే ఎలిమినేట్ అయ్యి ఉల్టా పూల్టా అంటూ హౌస్ లోకి రీ ఏంటి ఇచ్చి.. మళ్ళీ ఎలాంటి ప్రభావం చూపించలేక మళ్ళీ వచ్చిన మూడో వారంలోనే మరోసారి ఎలిమినేట్ అయ్యింది రతిక రోజ్ అప్పుడు ప్రశాంత్ తో గొడవపడి ఎలిమినేట్ అయిన రతిక ఈసారి కూడా అదే ప్రశాంత్ ని టార్గెట్ చేసి మరోసారి బలైపోయింది. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో అశ్విని, రతికలు ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు.