Advertisementt

బిగ్ బాస్ కంటెస్టెంట్ పై దాడి

Sun 26th Nov 2023 03:53 PM
vanitha vijaykumar  బిగ్ బాస్ కంటెస్టెంట్ పై దాడి
Attack on Bigg Boss 7 contestant బిగ్ బాస్ కంటెస్టెంట్ పై దాడి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 ఇటు తెలుగు, అటు తమిళ్ లో కొద్దిగా అటు ఇటుగా షోస్ మొదలయ్యాయి. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా, తెలుగులో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుంది. అయితే తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒకరిపై బయట దాడి జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తమిళ్ నటి వనితా విజయ్ కుమార్ గతంలో బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లారు. ఆమె హౌస్ లో చాలామందితో గొడవలు పడింది. ఆమె బయట కూడా ఎప్పుడూ కాంట్రవర్సీలకి కేరాఫ్ గానే కనబడుతుంది.

అయితే రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 లో ఆమె కుమార్తె జోవిక ఉంది. అయితే సీజన్ 7 బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసి రివ్యూస్ ఇచ్చే వనిత విజయ్ కుమార్ పై శనివారం రాత్రి దాడి జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆమె ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చే వారిపై యూట్యూబ్ ల్లో రివ్యూ ఇస్తోంది. శనివారం రాత్రి కూడా ఆమె అలాగే బిగ్ బాస్ రివ్యూ ఇచ్చి, డిన్నర్ చేసి ఇంటికి వెళ్లడానికి బయలుదేరగా.. ఆమె కారు దగ్గరకి వెళ్ళగానే గుర్తు తెలియని వ్యక్తి వనిత విజయ్ కుమార్ పై దాడి చేసి ఆమెని గాయపరిచినట్లుగా ఆమె తన మొహానికి దెబ్బ తగిలిన పిక్ ని పోస్ట్ చేస్తూ.. తనపై దాడి చేసింది ప్రదీప్ ఆంటొని సానుభూతిపరుడే అంటూ ఆరోపిస్తుంది.

తన మొహంపై రక్తం వచ్చేలాగా కొట్టినట్లుగా చెబుతూ ఫోటోని షేర్ చేసింది. తనపై ఇలాంటి క్రూరమైన దాడి జరగడం మొదటిసారి అని, బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రదీప్ కు రెడ్ కార్డ్ ఇస్తావా అంటూ ఆగంతుకుడు తనపై దాడికి పాల్పడ్డాడని చెప్పింది. జోవిక మరికొంతమంది అమ్మాయిలు బిగ్ బాస్ హౌస్ లో ప్రదీప్ పై పలు ఆరోపణలు చేసేవారు. దానితో కమల్ హాసన్ ప్రదీప్ కి రెడ్ కార్డు ఇచ్చి అతన్ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపేశారు. ప్రదీప్ పై బయట సింపతీ క్రియేట్ అవ్వడమే కాదు ప్రదీప్ కు మద్దతుగా ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ప్రదీప్ ను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రదీప్ ని పంపేంసిన విషయంలో తనపై కోపం పెంచుకున్న ఓ అభిమానే ఈ దాడికి పాల్పడ్డట్లుగా వనిత ఆరోపిస్తోంది.

Attack on Bigg Boss 7 contestant:

BB Tamil Season 7: Vanitha Vijaykumar allegedly attacked by Pradeep Antony supporter

Tags:   VANITHA VIJAYKUMAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ