యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు. సుమ యాంకరింగ్ కి స్పెషల్ ఫాన్స్ ఉండడం కాదు.. ఆమె యాంకరింగ్ ని ప్రతి తెలుగు వాడు ఆస్వాదిస్తాడు. నిత్యం సినిమా ఈవెంట్స్ తో అలాగే బుల్లితెర షోస్ తో యమా బిజీగా ఉంటుంది. ఒక మాదిరి సామాన్యుడికి సుమ డేట్స్ కావాలంటే చాలా కష్టం. బాహుబలి దగ్గర నుంచి ఆర్.ఆర్.ఆర్ ఇంటర్వూస్ వరకు, చిన్న సినిమా దగ్గర నుంచి క్యాష్ షో వరకు, ఇలా ఎక్కడ చూసినా సుమనే కనిపిస్తుంది.
అంత బిజీగా వుండే సుమ ఈ రోజు మరింత బిజీగా మారింది. సుమ యాంకర్ గా నాలుగు సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ ఒకే రోజు.. మరి సుమకి ఇది స్పెషల్ కాకపోయినా చూసే ప్రేక్షకులకి మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఇంతకీ సుమ చెయ్యబోయే ఆ నాలుగు సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ ఏమిటో చూసేద్దాం. ఒకటి తన కొడుకు రోషన్ బబుల్ గమ్ ఇంటర్వ్యూ తో పాటుగా.. నితిన్ ఎక్సట్రార్డినరీ మ్యాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి Imax, అలాగే యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్లనున్న సుమ ఆ తర్వాత హీరో నాని హాయ్ నాన్న ప్రమోషన్స్ కి వ్యాఖ్యాతగా చేయబోతుంది.
ఇదే విషయాన్ని సుమ తన సోషల్ మీడియా అకౌంట్ X లో Good morning fam! Happy Monday…Have a fantastic start to the week ahead! ✨ Its a super busy day for me!#Bubblegum to #ExtraOrdinaryMan to #Animal to #HiNanna అంటూ ట్వీట్ చేసింది. మరి ఇదంతా చూస్తే ఒకేరోజు 4 ఈవెంట్స్.. బహు బిజీ సుమా అనాలనిపించదూ..!