బిగ్ బాస్ సీజన్ 7 లోకి అతి సామాన్యుడిగా అడ్డుపెట్టి ఇప్పుడు హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్ గా టైటిల్ రేస్ కి దగ్గరగా వచ్చిన కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ అనే ట్యాగ్ తోనే చాలా వరకు హౌస్ లోను, బయట సర్వైవ్ అయ్యాడు. గట్టి పిఆర్ టీమ్ తో పల్లవి ప్రశాంత్ ఇప్పడు స్ట్రాంగ్ ప్లేయర్ గానే కాదు.. సీజన్ 7 విన్నర్ స్థానానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అయితే మొదటి నుంచి రైతు బిడ్డ అంటూ సింపతీ గేమ్ ప్లే చేసిన పల్లవి ప్రశాంత్ తర్వాత శివాజీకి శిష్యుడిగా మరిపోయాడు. హౌస్ లో ఒకలా, నామినేషన్స్ రోజు మరోలా బిహేవ్ చేసే పల్లవి ప్రశాంత్ ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటాడు.
అయితే గత రాత్రి అంటే సోమవారం రాత్రి నామినేషన్స్ సమయంలో అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ నమ్మకద్రోహం చేసావంటూ నామినేషన్ వెయ్యగానే నేను నిన్ను మోసం చేసానా అంటూ ఏడుపు స్టార్ట్ చేసాడు. నువ్వు ఏడవకు, నేను ఏమన్నానని ఏడుస్తున్నావ్, నువ్ పోరా నేనే సెల్ఫ్ నామినేషన్ వేసుకుంటా అన్నాడు అమర్ దీప్. ఆతర్వాత నామినేషన్స్ ముగిసాయి. అమర్ దీప్ వచ్చి అరే నామినేట్ చేస్తే ఏడుస్తావా అంటే, కాదన్నా ఎందుకో ఏడుపొచ్చింది అంటూ మళ్ళీ స్టార్ట్ చేసాడు ప్రశాంత్.
ఆ తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తూ శివాజీ దగ్గరకొచ్చాడు. ఏమయిందిరా అని శివాజీ అడిగాడు, నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానా అన్నా అంటూ మళ్ళీ ఏడ్చాడు, ప్రశాంత్ ని యావర్ ఎంతగా సర్దిచెప్పి ఊరుకోబెట్టినా అతను ఏడవడం చూసిన నెటిజెన్స్ రైతు బిడ్డ మళ్ళీ సింపతీ గేమ్ స్టార్ట్ చేసాడురోయ్ అంటూ కామెంట్స్ మొదలు పెట్టారు.