Advertisementt

మెగాస్టార్ పై మన్సూర్ సంచలన వ్యాఖ్యలు

Tue 28th Nov 2023 05:40 PM
mansoor ali khan  మెగాస్టార్ పై మన్సూర్ సంచలన వ్యాఖ్యలు
Mansoor Ali sensational comments on Megastar మెగాస్టార్ పై మన్సూర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Ads by CJ

టాప్ హీరోయిన్ త్రిష పై కేరెక్టర్ ఆర్టిస్ట్ విలన్ పాత్రధారి మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే చెలరేగింది. ఈ ఇష్యు లో త్రిష ని సపోర్ట్ చేస్తూ చాలామంది సెలబ్రిటీస్ మన్సూర్ అలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మన్సూర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అలాగే కోలీవుడ్ నటి ఖుష్బూ కూడా మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఈ మేరకు మన్సూర్ అలీ ఖాన్ మెగాస్టార్ చిరు, త్రిష, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేసిన విషయాన్ని మన్సూర్ మీడియా ముఖంగా తెలియజేసాడు.

అంతేకాకుండా మన్సూర్ అలీ ఖాన్ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. మెగాస్టార్ చిరంజీవి పై మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చలకు దారి తీశాయి. తనది వక్ర బుద్ది అన్న చిరు ని ఉద్దేశిస్తూ ఎవరిది వక్ర బుద్ధి, చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్లు మింగాడు. అందులో నుంచి పేదవాళ్ళకి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. ఆ డబ్బులు అంతా తన అవసరానికి వాడుకున్నాడు. నేను చిరంజీవి, త్రిష, కుష్బూ ఈ ముగ్గురి మీద పరువు నష్టం దావా వేస్తాను. చిరంజీవి మీద 20 కోట్లు త్రిష, ఖుష్బూ మీద చెరో 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తాను. ఆ కేసు గెలిచివచ్చిన వచ్చిన డబ్బును తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకి సహాయం చేస్తాను.

అసలు ఈ విషయంలో చిరంజీవి గారు తప్పు చేశారు. త్రిషకి నాకు మధ్యలో ఏం జరిగిందో ఆయన ముందు తెలుసుకోవాలి. నాకు ఫోన్ చేసి ఏం జరిగిందనేది అడగకుండా ఆయన అలా స్పందించడం తప్పు.. ఆయన పార్టీలు చేసుకుంటారు. కానీ ఇలాంటివి మాత్రం ఫోన్ చేసి అడగరు అంటూ మెగాస్టార్ చిరు పై మన్సూర్ సంచలనంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

Mansoor Ali sensational comments on Megastar:

Mansoor Ali Khan Senseless Comments On Chiranjeevi 

Tags:   MANSOOR ALI KHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ